Advertisement
ఇళ్లల్లోకి బల్లులు రావడం వలన చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇంట్లోకి బల్లులు రాకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఒక్కోసారి బల్లులు ఇంట్లోకి వస్తే వాటిని బయటకు పంపించడం కష్టంగా ఉంటుంది. కిచెన్ లో వాటి రాక ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. బల్లులు విషపూరితమైనవి. వంటగదిలో ఆహార పదార్థాలు ఉంటాయి. ప్రమాదవశాత్తు అవి అందులో పడితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
Advertisement
గుడ్డు పెంకులు బల్లులని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. గుడ్డు పెంకులని ఉంచడం వలన ఆ వాసనకు బల్లులు పారిపోతాయి.
దోసకాయ కూడా బల్లులని తరిమికొట్టడానికి ఉపయోగపడుతుంది. దోసకాయ ముక్కల్ని కట్ చేసి మీరు టేబుల్ పైన వంటగదిలో పెడితే బల్లులు రాకుండా ఉంటాయి.
బల్లులని దూరంగా ఉంచడానికి కాఫీ కూడా హెల్ప్ చేస్తుంది. కాఫీ పొడిని పొగాకుతో కలిపి వండగదిలో పెడితే బల్లులు రాకుండా ఉంటాయి.
నిమ్మకాయ కూడా బల్లులని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. బల్లులు బలమైన వాసనలను అస్సలు ఇష్టపడవు. అలాంటి పరిస్థితిలో వెల్లుల్లి లవంగాలు కూడా మీకు సహాయం చేస్తాయి. ఇటువంటి వాటిని మీరు బల్లులని తరిమి కొట్టడానికి ఉపయోగించవచ్చు.
Advertisement
Also read:
పాడైపోయినవి లేదా మిగిపోయిన ఆహార పదార్థాలని పారేశాక డస్ట్ బిన్ మూత వేసేయండి.
ఫర్నిచర్ ని పెట్టేటప్పుడు ఒకదానికొకటి కనీసం ఐదు నుంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచండి. బల్లులని అరికట్టడానికి ఉల్లి, వెల్లుల్లి, నెమలికలను ఉపయోగించండి.
బల్లుల సంఖ్యని తగ్గించడానికి ఇంట్లో పిల్లుల్ని పెంచండి. ఇంటి నుంచి బల్లులను దూరం చేయడానికి ఏసి ఉష్ణోగ్రతను తగ్గించండి. ఇంట్లో కీటకాలు లేకుండా చూసుకోవాలి.
దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు బల్లుల్లి బాగా ఆకట్టుకుంటాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!