Advertisement
చాలా మంది అధిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు మీరు కూడా అధిక ఒత్తిడితో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఎలా చేయడం మంచిది భరించలేని ఒత్తిడిని జయించాలంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి. అప్పుడు ఒత్తిడి మాయమవుతుంది మనం తినే ఆహారాలు మనం మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి. అందుకని కొన్ని రకాల ఆహార పదార్థాలని డైట్ లో తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుడ్డు కచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. వీటిల్లోని కాంపోనెంట్స్ మూడ్ ని ఎలివేట్ చేస్తాయి. పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఒత్తిడి కూడా తగ్గుతుంది.
Advertisement
అలానే బ్రోకలీ, పాలకూర వంటి వాటిని తీసుకుంటే కూడా ఒత్తిడిని జయించొచ్చు. సాల్మన్ వంటి చేపల్ని తీసుకుంటే కూడా ఒత్తిడి తగ్గుతుంది. శనగల్లో పొటాషియం మెగ్నీషియంతో పాటు జింక్ వంటి పోషకాలు ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి శనగలు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి శనగలు కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ ఆహార పదార్థాలని మీరు మీ డైట్ లో చేర్చుకున్నట్లైతే ఒత్తిడి తగ్గుతుంది.
Advertisement
Also read:
Also read:
అలానే ఒత్తిడి తగ్గడానికి రోజు కాసేపు వ్యాయామం చేయండి. మెడిటేషన్ యోగ కూడా ఒత్తిడి తగ్గించేందుకు ఎంతగానో సాయం చేస్తాయి. ఒత్తిడిని తగ్గించడానికి నెగిటివ్ ఆలోచనలు మానుకోవాలి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎప్పటి పనుల అప్పుడు పూర్తి చేసుకోవాలి. పనులను సమయానికి చేసుకోకుండా డెడ్ లైన్ దగ్గర పడినప్పుడు కంగారు పడటం వలన ఒత్తిడి పెరిగిపోతుంది. అలానే మీ పనుల్ని మీరు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. అనవసరమైన ఆలోచనల వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!