Advertisement
Mada veedhulu : తిరుమలకు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా బ్రహ్మోత్సవాల సమయంలో అయితే వెంకటేశ్వర స్వామి సన్నిధి భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. టీటీడీ దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో 11 రోజులపాటు స్వామివారిని వివిధ అలంకరణలో అలంకరించి వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధులలో ఊరేగించే సమయంలో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.
Advertisement
అయితే వెంకటేశ్వర స్వామిని ఊరేగించే ఆ ప్రదేశాన్ని మాడ విధులు అని ఎందుకు అంటారు. అసలు ఈ మాడవీధులు అంటే ఏమిటి..? ఈ మాడ వీధులకు ఆ పేరు ఎలా వచ్చాయనే విషయం చాలా మందికి తెలియదు. అయితే తిరుమల మాడ వీధులకు ఆ పేరు ఎలా వచ్చిందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
పూర్వం శ్రీవారి ఆలయం చుట్టూ ఏ విధమైనటువంటి రహదారులు లేకపోవడంవల్ల స్వామివారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ధ్వజారోహణ చేసి మిగతా కార్యక్రమాలను తిరుచానూరులో నిర్వహించేవారు. శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులగా ఏర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగించడానికి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న రహదారులను వెడల్పు చేసి వాటిని మాడవీధులుగా ఏర్పాటు చేశారు.
తిరుమలలోని స్వామి వారి ఆలయం చుట్టూ నాలుగు వైపుల ఇప్పుడు ఉన్న ప్రధాన రహదారులనే మాడ వీధులు అని అంటారు. స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న రహదారుల పక్కన అర్చకులు నివసించడానికి ఉండే ప్రదేశంలోని ఇళ్ళను తమిళంలో మాడం అని పిలిచేవారు. ఈ పేరే కాలక్రమేనా మాడవీధులుగా మారింది. స్వామి వారి దేవాలయానికి నాలుగు దిక్కులలో ఉన్న ఈ రహదారులను తూర్పు మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తరమాడ వీధి, దక్షిణ మాడ వీధి అనే పేర్లతో పిలుస్తారు.
Also Read :
బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే ప్రమాదాలు ఇవే..!
Chanikya niti : చాణిక్యుడు స్త్రీల గురించి చెప్పిన 10 ముఖ్యమైన విషయాలు..?