Advertisement
మనం ఏదైనా వంట ఉండాలంటే కచ్చితంగా గ్యాస్ ఉండాలి. మనం గ్యాస్ పొయ్యిల మీద ఆధారపడిపోయాం. గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. అయినా కూడా మనకి తప్పదు. చలికాలంలోనూ, వర్షాకాలంలో చాలామంది వేడివేడి ఆహార పదార్థాలని తినాలనుకుంటారు. వేడి నీళ్లు కూడా పొయ్యి మీద పెట్టుకుంటారు. రెండు మూడు నెలలు రావాల్సిన గ్యాస్ ఒక నెలకే వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. పప్పులు, ధాన్యాలు ఉడకాలంటే చాలా సమయం పడుతుంది.
Advertisement
ఇలాంటి సమయంలో గ్యాస్ ఎక్కువ ఖర్చు అవ్వకుండా బియ్యం, పప్పును వండడానికి ఒక గంట ముందు నానబెట్టుకోండి. దీంతో గ్యాస్ ఆదా అవుతుంది. గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే గ్యాస్ బర్నర్స్ ని క్లీన్ చేయించుకోండి. మూడు నెలలకి ఒకసారైనా సర్వీసింగ్ చేయించుకుంటే గ్యాస్ ఆదా అవుతుంది. శుభ్రంగా ఉండడం వలన బాగా పనిచేస్తుంది. వంటలు వండేటప్పుడు గిన్నెలకు బదులుగా కుక్కర్ ని ఉపయోగించడం వలన గ్యాస్ మరింత ఆదా అవుతుంది.
Advertisement
Also read:
సాధారణంగా ప్రతి ఒకరు కడిగిన పాత్రలని నేరుగా పొయ్యి మీద పెడతారు ఆ తడిపోయే వరకు గ్యాస్ ఆన్ చేసి ఉంచుతారు. అలా చేయడం వలన గ్యాస్ వేస్ట్ అవుతుంది. తుడిచిన తర్వాత పొయ్యి మీద పెట్టి వండడం మొదలు పెడితే గ్యాస్ ఆదా అవుతుంది. ఫ్రిజ్ లోంచి తీసిన వెంటనే ఆహార పదార్థాలను గ్యాస్ మీద పెట్టకండి. కాసేపు రూమ్ టెంపరేచర్ లో ఉంచి ఆ తర్వాత పెట్టండి ఇలా చేయడం వలన గ్యాస్ ఆటో చేసుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!