Advertisement
మధ్యాహ్నం పూట కొంత మందికి ఆహారం తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుంటుంది. ఈ పని మీద దృష్టి పెట్టలేకపోతుంటారు. కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకి సాధారణంగా ప్రతి ఒక్కరూ లంచ్ చేస్తూ ఉంటారు. లంచ్ తిన్న తర్వాత కొంత మంది నిద్ర అస్సలు నిద్ర ని కంట్రోల్ చేసుకోలేక పోతుంటారు. నిద్ర వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. అయితే తిన్న తర్వాత ఉత్సాహంగా పని చేసుకోవాలంటే ఇలా చేయండి. ఎక్కువమంది లంచ్ ని హెవీగా తీసుకుంటూ ఉంటారు. దాని వలన పని మీద ధ్యాస పెట్టలేకపోతు ఉంటారు.
Advertisement
Advertisement
వెంటనే నిద్ర వచ్చేస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే కొంచెం లంచ్ తగ్గించండి. ఉదయాన్నే అల్పాహారం కొంచెం హెవీగా తీసుకుని లంచ్ ని తక్కువ తీసుకోండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ తో కంపేర్ చేసుకుంటే ఫ్యాట్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటే, జీర్ణం అవ్వడానికి సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. రాత్రిపూట ఫుల్లుగా నిద్రపోతే మధ్యాహ్నం పూట నిద్ర రాదు. కాబట్టి మీరు రాత్రి మంచిగా నిద్రపోయేలా చూసుకోండి. తిన్న వెంటనే మీకు నిద్ర వచ్చేస్తున్నట్లయితే ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం కూడా మంచిది.
Also read: