Advertisement
విజయేంద్రప్రసాద్ ఇండియాలోనే అతిపెద్ద రైటర్. ఈయన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన కొడుకు రాజమౌళి సినిమాలకి దాదాపు విజయేంద్రప్రసాద్ కథని అందిస్తూ ఉంటారు. బాహుబలి సిరీస్ కథని కూడా విజయేంద్ర ప్రసాద్ రాశారు ఈ కథ ఎలా మొదలైంది అనేది విజయేంద్రప్రసాద్ చెప్పి షాక్ ఇచ్చారు. బాహుబలి ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని మార్చేసింది. ఈ సిరీస్ లో వచ్చిన బాహుబలి బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో షేక్ చేయించాయి. బాహుబలి 2 ఇప్పటికీ ఇండియాలో అత్యధిక వసుళ్ళని రాబట్టిన సినిమాగా ఉంది.
Advertisement
పాన్ ఇండియా కాన్సెప్ట్ బాహుబలి సినిమా తోనే తెరమీదకి వచ్చింది తెలుగు ఇండస్ట్రీ బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనే విధంగా మారిపోయింది. బాహుబలి కథకి బీజం ఎలా పడిందో రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పడం జరిగింది. కట్టప్ప పాత్రకి ముందుగా ఎవరిని అనుకున్నారు అనేది కూడా చెప్పారు ఒకరోజు ప్రభాస్ కోసం కథని కావాలి అని స్త్రీ పురుషులకి సమాన ప్రాధాన్యత ఉన్న యాక్షన్ సబ్జెక్టు కావాలని రాజమౌళి చెప్పారట అప్పుడు విజయేంద్ర ప్రసాద్ కట్టప్ప పాత పాతని పరిశీలిస్తారు యువకులకు నేర్పుతుంటారు అతని వద్దకు ఒక విదేశీయుడు వస్తాడు మాటలు మధ్యలో బాహుబలి ప్రస్తావన వస్తుంది.
Advertisement
బాహుబలి చేతిలో కత్తి ఉన్నంత దాకా అతని ఎవరూ చంపలేరని విదేశీయుడికి వృద్ధుడు చెప్తాడు ఆ వీరుడు ని కలవాలని విదేశీయుడు ఆశపడతారు ఆ వీరుడు ఇప్పుడు బతికి లేడని చెప్తాడు అతను ఎలా చనిపోయాడు అని అడగ్గా ఆయుధం కంటే పదునైంది వెన్నుపోటు అతని నేనే చంపాను అని చెప్తాడు. పసిబిడ్డ ని తీసుకుని ఒక మహిళ నది ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది అని రాజమౌళికి విజయేంద్ర ప్రసాద్ చెప్పారట ఈ సన్నివేశాలు ఆధారంగా కథ రాయమని రాజమౌళి కోరారట. కట్టప్ప పాత్ర సంజయ్ దత్ని దృష్టిలో పెట్టుకుని కథ రాశారు. కానీ ఆయన చేయడం కుదరలేదు. ఆ స్థానంలో సత్య రాజ్ ని ఎంచుకున్నారు అప్పటి విషయాలని విజయేంద్ర ప్రసాద్ షేర్ చేసుకున్నారు విజయేంద్ర ప్రసాద్ మాటల్ని బట్టి చూస్తే అసలు బహుబలి కదా కట్టప్ప పాత్ర ఆధారంగా అల్లారు అని తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!