Advertisement
అందంగా ఉండడమే ఆమె తప్పైపోయింది. పెళ్లి చేసుకునేటప్పుడు ఏరి కోరి ఆమెని పెళ్లి చేసుకున్నారు. భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. జీవితాంతం తోడు ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమెని చంపేశారు. దారుణమైన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో బ్యాంక్ కాలనీలో చోటుచేసుకుంది. జనగామ జిల్లాకి చెందిన రమేష్ కమల కొన్నాళ్లు క్రితం హైదరాబాద్ కి వచ్చారు. ఉప్పల్ లోని బ్యాంక్ కాలనీలో ఉంటున్నారు.
Advertisement
తన భార్యతో సంతోషంగా ఉన్నారు హాయిగా సాగుతున్న వీళ్ళ దాంపత్యంలోకి అనుమానం పెనుభూతంలో వచ్చింది. జీవితం తలకిందులైపోయింది. భార్య అందంగా ఉండడం ఉద్యోగరీత్యా రమేష్ ఆఫీస్ లో ఎక్కువ సమయం ఉండడంతో భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం కలిగింది. రోజు రోజుకి అది పెరిగిపోయి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
Advertisement
Also read:
సోమవారం నాడు ఇద్దరి మధ్య అదే విషయంలో గొడవ జరిగింది తీవ్ర ఆగ్రహానికి గురైన రమేష్ అర్ధరాత్రి కమలను గొంతు నులిమి చంపేశారు పోలీస్ స్టేషన్కు వెళ్లి తర్వాత లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాలామంది భార్యల మీద అనుమానం పెట్టుకుని సంతోషంగా సాగే వైవాహిక జీవితం నీ సమస్యలతో నింపుకుంటారు అనవసరంగా అనుమానించి ఇంతటి ఘోరానికి పాల్పడడం సరి కాదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!