Advertisement
తల్లిదండ్రుల తర్వాత ఒక అమ్మాయి ఎక్కువగా ప్రేమించే వ్యక్తి తన భర్త. భార్య ప్రేమ బయటకు కనిపించినా భర్త ప్రేమ మాత్రం గుండెల్లోనే ఉంటుంది. ఒక భర్త ప్రేమ ఎప్పుడు బయటపడుతుంది అంటే భార్య అనారోగ్య పరిస్థితులు అని ఎప్పుడు నుంచో పెద్దలు చెబుతున్న మాట. అయితే ఇప్పుడు ఇదే విషయంపై ప్రస్తుతం ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
ఇందులో ఓ వ్యక్తి క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్య జుట్టును షేవింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతని భార్య బోరున విలపిస్తోంది. ఆమె వెంట్రుకలన్నీ తొలగించిన తర్వాత, అతను కూడా తన జుట్టును కూడా తొలగిస్తాడు. భర్త ఆ పని చేయడానికి గల కారణమేంటంటే నీ జీవితంలో నీకు ఏ పరిస్థితిలోనైనా నీకు అండగా ఉంటాను అని తన భార్య యొక్క ధైర్యాన్ని పెంచడానికి అలా చేస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్ న్యూస్ మూవ్మెంట్ అనే ఖాతా ద్వారా షేర్ చేయబడింది.
Advertisement
‘ఎవరూ ఒంటరిగా పోరాడరు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్యకు తోడుగా ఆ భర్త తన తలను గుండు కొట్టించుకున్నాడు.చివరి వరకు చూడండి అని వీడియో క్యాప్షన్ ఉంది. వీడియో చివర్లో ఆ దంపతుల బిడ్డ ఫోటో ఉంది. వీరికి మహిళ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రసవించింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 1 మిలియన్ల మంది వీక్షించారు. నెటిజన్లు సైతం వీడియోపై కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మీరు జుట్టు లేకుండా ఇంకా అందంగా ఉన్నారు అంటూ.. కచ్చితంగా మీ జీవితంలో అన్ని విజయాలు సాధిస్తారు అంటూ ఆమెకి ధైర్యాన్ని చెప్పే విధంగా కామెంట్స్ రూపంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CwtLbaLS5Ab/?igshid=NTc4MTIwNjQ2YQ==