Advertisement
చాలామంది భార్య భర్తలు ఈ మధ్య విడిపోతున్నారు. పెళ్లయిన తర్వాత కలిసి కలకాలం జీవించాల్సిన భార్యాభర్తలు కొన్నాళ్ళకే విడిపోవడం బాధాకరం. భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. అలానే భార్య భర్తలు ఎప్పుడూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరు ఇష్ట ఇష్టాలను ఇంకొకరు తెలుసుకుని దానికి తగ్గట్టుగా అనుసరించాలి ఒకరు ఏమైనా చెప్తే వినాలి. కొంచెం సమయాన్ని ఇవ్వాలి. అయితే భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే భర్త ఖచ్చితంగా భార్యని ఈ ఐదు విషయాల్లో అర్థం చేసుకోవాలి.
Advertisement
అప్పుడు కచ్చితంగా భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది. చాలామంది భర్తలు భార్య ఏమైనా చెప్పే వినరు సరి కదా నీకేం తెలుసు అన్నట్లుగా చూస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదు. నేను చెప్పేది కనీసం వినడం లేదు నా భర్త అని భార్యలు బాధపడతారు. అలానే చాలామంది భర్తలు ఏం చేస్తారంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల్ని తిడుతుంటారు.
Advertisement
మీ అమ్మ నాన్న నేను ఇలానే పెంచారా? నీకు ఏమీ నేర్పలేదా అన్నట్లు చెబుతూ ఉంటారు భార్యకి బాధ కలుగుతుంది. ఎప్పుడు ఇలా భర్తలు ఇలా చెప్పకూడదు. అలానే భార్య తాలూకా స్నేహితుల్ని కూడా వాళ్లకేం తెలియదు వాళ్లతో స్నేహం చేస్తున్నావేంటి అని కించపరుస్తూ ఉంటారు. దీనితో ఆమె బాధపడుతుంది. చాలామంది భర్తలు భార్యకి స్నేహితులు ఉండకుండా తొలగించడానికి చూస్తుంటారు. అది తప్పు.
అదేవిధంగా డ్రెస్సులు విషయంలో కూడా ఆడవాళ్ళకి సెంటిమెంట్లు ఉంటాయి ఎందుకు నా భర్త నా బట్టల విషయంలో బాండింగ్ ని గుర్తించరు అని చాలామంది భార్యలు బాధపడుతుంటారు. ఈ విషయంలో కూడా భర్తలు జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. అదేవిధంగా పిల్లల విషయంలో కూడా భర్త భార్య ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకోవాలి భర్త ఒక్కరే నిర్ణయం తీసుకోకూడదు. భార్య పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉండి ఆమె ఒప్పుకుంటే అప్పుడు ప్లాన్ చేసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా భర్త ఒక్కరే నిర్ణయం తీసుకోకూడదు. ఇలా ఈ విషయాల్లో భార్యని కచ్చితంగా భర్త అర్థం చేసుకోవాలి.
Read More Latest Telugu News Here