Advertisement
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. నాని ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ కెరియర్లో బిజీ అయిపోయారు. త్వరలోనే నాని సరిపోద శనివారం అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకి రావడానికి రెడీ అయ్యారు. ఇది ఇలా ఉంటే నటుడు ప్రియదర్శి నాభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ డార్లింగ్ జూలై 19న ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు చేయబోతున్నారు.
Advertisement
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాని వచ్చారు. నాని మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వచ్చే నెల సరిపోదా శనివారం అనే సినిమా ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. వచ్చే నెల నుండి ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాను కానీ ప్రియదర్శి వలన ముందుగానే స్టార్ట్ అయ్యాయి. ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉందని డార్లింగ్ టీజర్, ట్రైలర్ బాగున్నాయని చెప్పారు.
Advertisement
Also read:
ఇటీవల కాలంలో ఎక్కువగా యాక్షన్స్ సినిమాలు వస్తున్నాయి. కామెడీ లవ్ స్టోరీలు మిస్ అవుతున్నామని అన్నారు. గత ఏడాది లవ్ స్టోరీ ఎమోషనల్ మూవీ హాయ్ నాన్నతో వచ్చానని అన్నారు. ఈ పదేళ్ల కాలంలో నాకు నచ్చిన సినిమా బలగం సినిమా అని నాని అన్నారు. డార్లింగ్ సినిమా కూడా బలగం అంత ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటున్నాను అని నాని అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!