Advertisement
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆయన సినిమా అయినా పాలిటిక్స్ అయినా ఏదైనా కామెంట్ చేశాడంటే అది వివాదస్పదం కావాల్సిందే. తాజాగా వర్మ ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే మూవీని నిర్మిస్తున్న విషయం విధితమే. ఈ సినిమా స్టోరీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత నుంచి ప్రారంభం అవుతుంది. దాదాపు వైఎస్ జగన్ ని కీర్తిస్తూ ఈ సినిమా ఉండనుంది. ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు వ్యతిరేకంగా ఆర్జీవీ ఎక్కుపెడుతున్నట్టు సమాచారం.
Advertisement
Advertisement
ఈ చిత్రంలో అజ్మల్, మానస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ చనిపోయిన దగ్గర నుంచి వ్యూహం కథ ప్రారంభం అవుతుందని చెప్పారు. రెండు భాగాలుగా చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. వైఎస్ మరణం తరువాత ఎవరెవరు ఎలాంటి వ్యూహాలు రచించారో వివరిస్తామన్నారు వర్మ. ఈ సినిమాలో వివేకానందరెడ్డి Ha త్య కూడా చూపిస్తామని స్పష్టం చేశారు. ఈ సినిమాలో జగన్ తో పాటు భారతి పాత్ర కూడా ఉంటుంది. ఈ సినిమా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ప్రస్తుతం ఏపీ రాజకయీలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అందులోని ప్రధాన ఘట్టాలు ఈ సినిమాలో ఉంటాయి. తాను జగన్ కి అభిమాననే కానీ ఇతరులెవ్వరిపైనా ద్వేషం లేదు. జగన్ పై ఉన్న అభిప్రాయాన్ని సినిమాగా చూపిస్తున్నాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పిలిచి అడిగినా దర్శకత్వం చేయను అని తేల్చి చెప్పారు రామ్ గోపాల్ వర్మ.
Also Read :
విడుదలకు ముందే పుష్ప 2 అరుదైన రికార్డు..!
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సేన్ ?