Advertisement
తెలంగాణ హైకోర్టు సీఎస్ సోమేష్ కుమార్ కు సడెన్ షాక్ ఇచ్చింది. ఏపీకి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో చేసేదేంలేక ఆయన అక్కడకు వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. అయితే.. సోమేష్ ప్లేస్ లో తెలంగాణ సీఎస్ గా ఎవరిని నియమిస్తారా? అని అందరూ ఆసక్తిగా చూశారు. తెరపైకి చాలామంది పేర్లు వచ్చాయి.
Advertisement
రాష్ట్ర క్యాడర్ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా, రాణి కుమిదిని, శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్ కుమార్ శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్ ఉన్నారు. వీరిలో రామకృష్ణారావు, అరవింద్ కుమార్, రజత్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎవరో ఒకరిని నియమిస్తారని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా శాంతికుమారిని నియమించారు సీఎం కేసీఆర్.
Advertisement
శాంతికుమారిని సీఎస్ గా నియమిస్తూ.. అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలిసారి తెలుగు, మహిళా అధికారికి కీలక బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రకటన కంటే ముందే శాంతికుమారితో చర్చలు జరిపారు కేసీఆర్. అధికారిక ప్రకటన వెలువడ్డాక ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరీ శాంతికుమారి అనే చర్చ జరుగుతోంది.
శాంతికుమారి 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ కమిషనర్ గా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సీఎంవోలో కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్ గా కూడా పనిచేశారు. 2025 ఏప్రిల్ వరకు ఈమె పదవీకాలం ఉండనుంది.