Advertisement
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి ఇండస్ట్రీని మొత్తం షేక్ చేస్తోంది. కేపీ చౌదరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చాలా క్లోజ్ ఉంటారంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి అషురెడ్డితో పాటు సురేఖా వాణి జ్యోతి పేర్లు బయటికి వినిపించాయి. అంతేకాదు.. కేపీ చౌదరితో ఉన్న ఫొటోలను కొన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేసాయి.
Advertisement
ఈ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని సోషల్ మీడియాలో వారు వీడియోలను పోస్టు చేశారు. ఇక మరికొన్ని ఛానల్స్ అయితే రిమాండ్ రిపోర్టులను చూపెడుతూ.. అషురెడ్డి నెంబర్ ను బయటపెట్టాయి. ఈ వ్యవహారంపై స్పందించిన అషురెడ్డి మరోసారిసోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది. గత రెండు రోజులుగా నా చుట్టూ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కొన్ని ఛానెల్స్ ఆ విషయంలో నా నెంబర్ ని ఓపెన్ గా చూపించి ఇబ్బంది కలిగించారు. ఛానెల్స్ చెబుతున్నట్టు కేసుకు నాకు ఎంత వరకు సంబంధం ఉందనే విషయం గురించి నేను కూడా మాట్లాడగలను. ఎందుకంటే.. నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. వందల కాల్స్ గంటల కొద్ది మాట్లాడానని చెప్పారు. నేను వాటిని రుజువు చేసుకునే హక్కు నాకు కూడా ఉంది. ఈ విషయంపై నేను స్పందించాల్సిన అవసరముంది.
Advertisement
సదరు ఛానెల్స్ చేస్తున్న ఆరోపణలను ఒప్పేసుకున్నా. ఇలాంటి వీడియో రిలీజ్ చేయకుండా సైలెంట్ గా ఉందామనుకున్నా బయటికీ వచ్చిన న్యూస్ లకు చాలా మానసిక వేదనను అనుభవించాను. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని ఛానెల్స్ నోటికొచ్చినట్టు మాట్లాడాయి. కచ్చితంగా నేను వారిపై పరువు నష్టం కేసు వేస్తాను. మీరు నా నెంబర్ ను ఓపెన్ చూపించడం వల్ల ప్రతీ సెకనుకి ఓకాల్ వస్తుంది. రెండు రోజులుగా చాలా ఇబ్బంది పడ్డాను. ఈ నెంబర్ ని ఉపయోగించాలనుకోవడం లేదు. ఈ ఇష్యూ జరిగినప్పుడు నేను వేరే దేశంలో ఉన్నాను. నాకు ఎలాంటి సంబంధం లేదు. కచ్చితంగా దీని గురించి ఇంకా మాట్లాడుతాను.. ప్రస్తుతం కేపీ చౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటాయనేది తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే. రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాను తెలుగులో కేపీ చౌదరి విడుదల చేసారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :