Advertisement
మన హిందూ సంప్రదాయంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి పని చేస్తూ ఉంటారు. శాస్త్రాన్ని ఉపయోగించి మంచి ఫలితాలను పొందుతారు. ఈ శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్రమే కాకుండా పుట్టుమచ్చల శాస్త్రం, కళాశాస్త్రం ఇలా అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుట్టుమచ్చల శాస్త్రం.. ఈ శాస్త్రం అనేది శరీరంపై ఉండే పుట్టుమచ్చలను బట్టి జరిగే ఫలితాలను తెలియజేస్తుంది.
Advertisement
also read:Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 30.03.2023
ఈ పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా మన శరీరం మీద ఉండే పుట్టుమచ్చలతో మన జీవితం ఎలా ఉండబోతుందో చెబుతూ ఉంటారు పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు. మరి మన శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా పురుషులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ముఖ్యంగా పురుషులకు తల పైన పుట్టుమచ్చ ఉంటే వారికి గర్వం ఎక్కువగా ఉంటుందని, ప్రతిదాన్ని నిషితంగా పరిశీలిస్తారని అంటారు. అలాగే రెండు చెవుల మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉన్న ధనవంతులవడంతో పాటు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయట.
Advertisement
also read: అక్కడ సీతారాముల వారి కళ్యాణంతో పాటు వారి పెళ్లి కూడా చేస్తారట..!!
ఇక ముక్కు మీద పుట్టుమచ్చ వున్న పురుషులకు క్రమశిక్షణ లోపిస్తుంది. భుజం మీద పుట్టుమచ్చ వున్నవారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక మెడ పైన పుట్టుమచ్చ కలిగిన పురుషులు భార్య ద్వారా ధన లాభం పొందుతారు. ఇక పొట్ట పైన పుట్టుమచ్చ వున్నవారు ఎక్కువగా భోజనం చేస్తుంటారు. ఎడమ కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారు కష్టపడే గుణం కలిగిన వారు. ఇక పిక్కలపై పుట్టుమచ్చ ఉంటే పనిలో అలసత్వం కలిగి ఉంటారని పుట్టుమచ్చల శాస్త్రం తెలియజేస్తోంది.