Advertisement
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమా ఆస్కార్ అందుకుంటుందా? తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా? వంటి అనుమానాలను RRR (రౌద్రం రణం రుధిరం) పటాపంచలు చేసింది. నామినేషన్ అందుకోవడమే కాదు.. నాటు నాటు పాట 95 వ ఆస్కార్ అవార్డు వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డును గెలుచుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, తొలి భారతీయ సినిమా పాటగా చరిత్ర సృష్టించింది. ఈ పాటకి ఆస్కార్ వచ్చిందనే విషయం తెలిసి సినీ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Advertisement
Read also: SEER FISH IN TELUGU: సీయర్ ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?
ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్రపతి మొదలుకొని ప్రధానితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఆర్ఆర్ఆర్ యూనిట్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇదే సమయంలో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ వంటి వారు.. సౌత్ సినిమాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని చేసిన విమర్శలు సరికొత్త చర్చకు దారితీసాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను కాదని గుజరాత్ ” చెల్లో షో” సినిమాను ఆస్కార్ కు పంపడంతో కేంద్రం వైఖరి స్పష్టమైందని అంటున్నారు. గుజరాత్ సినిమా అయినందువల్లే “చెల్లో షో”ను ఆస్కార్ కు పంపారని.. కానీ ఫలితం చూశారు కదా అంటూ మండిపడుతున్నారు.
Advertisement
Also Read: Telugu News, Tollywood Telugu cinema News
కొందరు నెటిజనులు కూడా ఈ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమాను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరపున షార్ట్ లిస్ట్ చేయలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా స్థానంలో గుజరాతి సినిమా “చెల్లో షో”ని పంపించింది. కానీ ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీ కూడా కాలేకపోయింది. మరోవైపు ఇండియా తరపున నామినేట్ కాకపోవడంతో ఫారిన్ ఎంట్రీ కింద ఆర్ఆర్ఆర్ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాతలే సొంతంగా పంపించుకున్నారు. ఇక ఆ తర్వాత అన్ని దశలు దాటి ఆస్కార్ కైవసం చేసుకుంది. నిజంగానే “చెల్లో షో” ని కాకుండా ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ కు పంపిస్తే.. నేడు ఇండియా ఖాతాలో మరో అవార్డు చేరి ఉండేది అని కామెంట్స్ చేస్తున్నారు.
Read also: అబ్బాయిలు ఇది మీకే ! అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలో ఈ అలవాట్లు కచ్చితంగా ఉండాలి..!!