Advertisement
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఓవైపు అధికార బీఆర్ఎస్, మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ రసవత్త పోరు కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. తొలిసంతకం రూ.2లక్షల రుణమాఫీ పైనే చేస్తామని హామీ ఇచ్చారు కోమటిరెడ్డి. అదేవిధంగా రూ.4వేల పింఛన్ కూడా అందిస్తామని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Advertisement
Advertisement
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని.. ఆగస్టు చివరి వరకు కాంగ్రెస్ బస్సు యాత్ర చేపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలందరూ పర్యటిస్తారు. ఎన్నికల సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెబుతున్నాయి. తెలంగాణ గ్రూపు 2 పరీక్ష అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షను వాయిదా వేయమంటే వేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తామని.. వడగళ్ల వానకు పంటనష్టం కలిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. 24 గంటల కరెంట్ పై కేసీఆర్ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలే అని పేర్కొన్నారు. తెలంగాణలో రూ.50వేల కోట్లు మద్యం అమ్మకాల మీదనే వస్తున్నాయని.. ఆ డబ్బులు అన్నీ ఎటుపోతున్నాయి అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంట్ ఇస్తామని.. రాష్ట్రంలో విచ్ఛలవిడిగా భూములను అమ్మేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :