Advertisement
సాధారణంగా మన పెద్దల కాలం నుంచి కాకి మన ఇంటి పరిసరాల్లో అరిస్తే ఇంటికి చుట్టాలు రాబోతున్నారని చాలామంది నమ్ముతుంటారు. ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో ఎవరికీ తెలియదు కానీ పూర్వకాలం నుంచి ఈ విషయం పరిగణలో ఉంది. అయితే కాకిని పితృ దేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటారు. మనం భోజనం చేసే సమయంలో ఇంటి ముందు కాకి అరిస్తే మన పూర్వీకులు ఆ రూపంలో వచ్చారని నమ్ముతుంటారు. అందుకే కాకికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి కాకి మన ఇంటి వద్ద ఈ విధంగా అరిస్తే ఏం జరుగుతుంది..లాభమా నష్టమా..అనేది చూద్దాం..?
Advertisement
మనం ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు అది మనం సాధిస్తామా లేదా అనే విషయాన్ని కాకి ముందుగానే సంకేతం ఇస్తుంది. నిండుగా ఉన్నటువంటి నీళ్ల కుండపై కాకి ని ఎవరైనా చూస్తే వాళ్లు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే కాకి నోటితో ఏదైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అశుభానికి సంకేతం. వారికి త్వరలోనే ఏదో అశుభం రాబోతుంది అని తెలుసుకోవాలి. అలాగే కాకి మాంసం ముక్కను పట్టుకు పోతూ కింద ఉన్న వ్యక్తి పైన పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని చెబుతుంటారు. ఇలా ఎవరికైనా జరిగితే వారు వెంటనే జ్యోతిష్య పండితులను కలిసి తగిన పరిహారాలు చేసుకోవాలని అంటున్నారు.
Advertisement
అలాగే కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురి అవుతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాకులన్నీ ఒక దగ్గర గుంపుగా చేరి అరిస్తే ఆ స్థల యజమాని లేదా చుట్టుపక్కల ఉన్న వారికి ఏఓ ఇబ్బందులు ఎదురు కాబోతున్నారని సంకేతం. వ్యక్తి తలపై కాకి వాలితే త్వరలో వాళ్ళు గౌరవాన్ని కోల్పోతారని సంకేతం. కాకి మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కూర్చుంటే తన భర్త సమస్యల్లో పడతారు అని సంకేతం. కాకి సాయంత్ర సమయంలో మన ఇంటి పరిసరాలలో ఆగ్నేయం వైపు చూస్తూ అరిస్తే మనం ధనవంతులం కాబోతున్నామని సంకేతం ఇస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.