Advertisement
సాధారణంగా మన ఇంట్లో పడుకున్న సమయంలో దోమలు అనేవి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మన చుట్టూ తిరుగుతూ కుడుతూ మనల్ని నిద్రపోకుండా చేస్తాయి. ప్రస్తుత కాలంలో ఎన్ని ప్రత్యామ్నాయాలు చేసినా దోమలనేవి ఆగడం లేదు. వాటన్నింటికీ అవి అలవాటు పడిపోయి మనపై దాడి చేస్తూనే ఉన్నాయి. అలాంటి దోమలు మన వైపు చూడకుండా మనల్ని కుట్టకుండా ఉండాలంటే ఈ ఐదు వాసనలు చాలా ఉపయోగపడతాయట.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
వెల్లుల్లి:
Also Read: అధిక బరువా.. పరిగడుపున ఇది తాగండి ఇట్టే తగ్గుతారు..!!
వెల్లుల్లి నుండి ఘాటైన వాసన వస్తుంది. ఈ వాసన దోమలకు అసలు ఇష్టం ఉండదు. వెల్లుల్లి ఎక్కువగా తినే వారి రక్తాన్ని దోమలు తాగడానికి ఇష్టపడవు. ఎందుకంటే దోమలకి ఈ వాసన అస్సలు పడదు.
వేపాకులు :
దోమలకు అస్సలు ఇష్టం ఉండని వాసన వేపాకుల వాసన. దోమలు కుట్టకుండా ఉండేందుకు వేప నూనెను చేతులకు కాళ్లకు రాసుకోవచ్చు. దీనివల్ల దోమలు మన దరిదాపుల్లోకి కూడా రావు.
Advertisement
పుదీనా ఆకులు:
Also Read:MLA RAPAKA: సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాపాక.. రూ. 10 కోట్లు ఇస్తామన్నారంటూ..?
మనం తాగే టీలలో పుదీనా ఆకుల ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పుదీనాను చూయింగ్ గమ్ములలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు పుదీనా నుంచి తయారైన నూనె దోమలను దగ్గర రాకుండా చేస్తుందట.
తులసి ఆకులు:
తులసి ఆకులను కూడా దోమలు ఎక్కువగా ఇష్టపడవు. మీరు ఈ చెట్టును మీ ఇంటి దరిదాపుల్లో ఉంచుకుంటే ఈ ఆకుల నుండి వచ్చే వాసన దోమలకు అస్సలు పడదట.దీనివల్ల ఆ దరిదాపుల్లో దోమలు రావని అంటున్నారు.
Also Read:పవన్ సినిమాలో మంత్రి మల్లారెడ్డి విలన్..ఏం జరిగిందంటే..?