Advertisement
ప్రేమలో అయినా, యుద్ధంలో అయినా ఏది చేసినా కరెక్ట్ అని అంటుంటారు. ప్రేమ యొక్క లోతుని చెప్పడానికే ఈ నానుడి ఉంది. మనసారా ప్రేమించిన వారి కోసం మనం ఎంత దూరం అయినా వెళ్తుంటాం.
Advertisement
వారి కోసం మన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి కూడా క్షణం ఆలోచించం. వారు దూరం అవుతారంటే.. మనం జీవచ్ఛవంలా మిగిలిపోతూ ఉంటాం. ఇక ఆడవారి సంగతి చెప్పక్కర్లేదు. టైం పాస్ కోసం లవ్ చేసేవాళ్ళని పక్కన పెడితే.. చాలా మంది ఆడవారు సున్నిత మనస్కులుగా ఉంటారు.
ఇవి చదవండి :నటి సూర్యకాంతం భర్త ఎవరు.. ఏం చేసేవారు తెలుసా?
ప్రతి విషయాన్నీ గుట్టుగా దాచుకునే ఆడవారు తాము మనసారా ఎవరినైనా ప్రేమిస్తే మాత్రం.. వారి వద్ద ఏ విషయాన్ని దాచడానికి ఇష్టపడరు. తాము ప్రేమించిన వారికోసం ఏమైనా చేస్తారు. తమ పర్సనల్ విషయాలను సైతం ఏమీ దాచుకోరు.
ఇతరులతో పంచుకోవడానికి ఇబ్బంది పడే విషయాలను కూడా ఆడవారు తాము ప్రేమించిన వారితో పంచుకోవడానికి అస్సలు సంకోచించరు. ఒకవేళ ప్రేమించిన వారు వారిని బాధపెట్టిన, శారీరకంగా లేదా మానసికంగా బాధపెట్టినా, మాటలు అన్నా చాలా బాధపడతారు. కానీ పైకి ఏమీ చెప్పరు. సహిస్తారే తప్ప.. ప్రేమించిన వారిని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు.
Advertisement
ఇవి చదవండి : ఒక వెలుగు వెలిగి..ఆ తర్వాత కనుమరుగైన టాలీవుడ్ హీరోలు
తాము ప్రేమించిన వారితో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. డేటింగ్ కు వెళ్లడం, కలిసి తినడం, తిరగడం వంటివి చేయడానికి ఇష్టపడతారు. కలిసి గడపడం వలన వారిద్దరి మధ్య మరింతగా మానసిక బంధం ఏర్పడుతుందని విశ్వసిస్తారు.
తాము ప్రేమించిన వారితో ఫిజికల్ గా దగ్గరవడానికి కూడా ఇష్టపడతారు. ఇతరులను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని వీరు ప్రేమించిన వారి దగ్గర మాత్రం చనువుగా ఉండాలని కోరుకుంటారు. వారి సాంగత్యంలో ఉండాలని కోరుకుంటారు.
తాము ప్రేమించిన మగవారు ఇబ్బందుల్లో ఉంటె సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వారి కష్టాలను పంచుకోవడం లేదా ఓదార్పు నివ్వడానికి ముందుంటారు. ఎవరు నమ్మినా, లేకున్నా వారు సక్సెస్ అవుతారని బలంగా నమ్ముతారు.
ఇవి చదవండి : చాణక్య నీతి ప్రకారం ఈ 3 పనులు చేసుక తప్పక స్నానం చేయాలట ..! లేకుంటే ..!