Advertisement
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి కొంతమంది నెటిజన్లకు తమాషాగా అనిపించినా.. చాలామందికి మాత్రం ఇది పజిల్. మన కళ్ళని మోసం చేసే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పజిల్స్ ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్న త్రిల్ దీనికి కారణం. ఇవి కేవలం సరదాగా మాత్రమే కాదు.. అంతకు మించి ఐ టెస్ట్ కూడా ముఖ్యమే. ఇవి మీ బుర్రను చురుకుగా పనిచేసే విధంగా చేస్తాయి. మీ ఐ ఫోకస్ ఏ లెవెల్ లో ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి.
Advertisement
Read also: పెళ్లికి సిద్ధమైన యాంకర్ ప్రదీప్… అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement
మామూలుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవారు పజిల్స్ సాల్వ్ చేసేందుకు ఉవ్విళ్ళురుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే ఈ క్రేజీ పజిల్. ఈ చిత్రంలోని కుందేలును మీరు కనుగొనాలి. ఈ ఫోటోలో ఓ చెట్టు మొదలు ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడే ఓ కుందేలు దాగి ఉంది. ఈ ఫోటోలో కుందేలు ఎక్కడ దాగి ఉందో మీరు గుర్తించాలి. ఇది మరీ అంత కష్టమైన పని ఏమీ కాదు. ఈజీ అయినా సరే కొందరు దానిని కనిపెట్టలేక చేతులెత్తేస్తున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు చిన్న క్లూ కూడా ఇస్తున్నాం. అదేంటంటే మీరు ఫోటోలో ఎడమవైపు కాస్త దృష్టి పెట్టండి.
ఆ చెట్టు మొదలు రంగులో ఆ కుందేలు కలర్ కలిసిపోయింది. కాస్త టైం తీసుకుని అయినా సరే ఆ కుందేలు ఎక్కడ ఉందో కనిపెట్టగలిగితే మీరు గ్రేట్ అని చెప్పాలి. కుందేలును దొరకబట్టారా? అయితే కాసేపు ప్రేమగా చూసి వదిలేయండి. పాపం దానిని బంధించకండి. దీనికి కొద్ది మంది సమాధానమిచ్చినా.. మరి కొంతమంది మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ కు దీన్ని షేర్ చేయడం సహ ట్యాగ్ చేస్తున్నారు. ఈ పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.