Advertisement
సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లను తీసుకోవడం వల్ల చాలా రకాల పోషకాలు పుష్కలంగా అందుతాయి. అదేవిధంగా పండ్లను తీసుకుంటే వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చాలా మంది దగ్గుతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బాగా దగ్గుగా ఉన్నప్పుడు ఈ పండ్లు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. దగ్గు సమస్య నుంచి బయటపడొచ్చు. ఈ పండు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పైనాపిల్ పండు తీసుకుంటే దగ్గు, జలుబు వంటివి దూరం అవుతాయి. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. దగ్గుతో బాధపడే వాళ్ళు దానిమ్మ గింజల్ని కూడా తీసుకుంటే బెటర్. దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి శరీరంలో వైరస్ లని ఇది నిర్మూలిస్తుంది. దగ్గు, జలుబు ఉన్నప్పుడు దానిమ్మ రసం తీసుకుంటే వెంటనే రిలీఫ్ కలుగుతుంది. దగ్గు, జలుబుతో బాధపడే వారు అరటిపండును కూడా తీసుకోవచ్చు. వాంతులు, వికారం సమస్య ఉంటే అవి దూరం అవుతాయి. పొటాషియం కంటెంట్ అరటి పండ్లలో ఎక్కువ ఉంటుంది.
Advertisement
కివిని తీసుకుంటే కూడా దగ్గు తగ్గుతుంది. కివిలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి కివితో రోగినిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ లో కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి స్ట్రాబెర్రీ తక్కువ జలుబు ని దూరం చేయగలవు. నిమ్మ కూడా దగ్గు జలుబు వంటి వాటి నుండి ఉపశమనం ఇస్తుంది. నిమ్మ లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఆపిల్స్ పుచ్చకాయని కూడా దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళు తీసుకోవచ్చు ఇలా ఈ పండ్లతో ఈ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పండ్లను తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి.