Advertisement
సాధారణంగా ఎవరి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఎలా ఉంటుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. ఈరోజు ఆర్థికంగా బాగున్న వారు రేపు ఉండకపోవచ్చు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కున్న వారు రేపు ఆర్థిక ఇబ్బందులే లేకుండా కావచ్చు. ఆర్థిక పరిస్థితులు ఎవరికైనా ఎప్పుడూ ఒకేవిధంగా ఉండవు.
Advertisement
అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు సోమవారం శివుడికి అంకితం చేయబడిన రోజు కావడంతో శివ లింగానికి పాలు లేదా గంగాజలంతో అభిషేకం చేయాలి. ముఖ్యంగా శివుడిని సోమవారం ఆరాధించడం వల్ల వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.సోమవారం శివుడిని హృదయ పూర్వకంగా పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ప్రధానంగా ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే శివుడిని పూజిస్తూ ఐదు సోమవారాలు కొన్ని చర్యలు చేయాలని సూచించారు. డబ్బు ఇబ్బందులు కలుగకుండా ఉండటం కోసం సోమవారం శివుడి పూజలో చేయాల్సిన చర్యలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
- సోమవారం శివునికి, చంద్రునికి సంబంధించిన రోజుగా పరిగణించబడుతుంది. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి.. శివ శంకరుడిని దర్శించి శివ చాలీసా లేదా శివాష్టకాన్ని పఠించాలి. శివుడిని ఇలా పూజించడం వల్ల చాలా సంతోషపడుతాడని.. తనను పూజించే భక్తులపై అనుగ్రహం కురిపిస్తాడని ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదని నమ్మకం.
- సోమవారం ఉదయం వేళలో శివునికి గౌరీ శంకర రుద్రాక్షను సమర్పించినట్టయితే అది మీ వైవాహిక జీవితంలో లేదా వివాహంలో ఉన్నటువంటి అడ్డకులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు.. మీకు ఇంట్లో డబ్బులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
- సోమవారం ఉదయం తెల్లని చందనాన్ని బిల్వ పత్రానికి పూసి.. మనస్సులో కోరికను చెప్పి శివుడికి ఆ బిల్వ పత్రాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ యొక్క కోరికలు నెరవేరడంతో పాటు ఇంట్లో లక్ష్మీదేవి నివాసముంటుంది.
- సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి రాగిపాత్రలో పాలు తీసుకొని పని చేసే చోట పాలత శుద్ధి చేస్తూ.. ఓం నమ:శివాయ్ అని జపిస్తూనే ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి జరగడంతో పాటు ఇంట్లో డబ్బులకు కూడా ఇబ్బందులు కలుగవు.
- సోమవారం శివాలయం వద్దకు వెళ్లి శివయ్య దర్శనం చేసుకొని.. రుద్రాక్ష మాలతో ఓం నమో ధనదాయ స్వాహా అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల అనుకున్నది నెరవేరుతుంది. మీ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం సోమవారం రోజు శివుడిని ఇలా పూజించండి. ఆర్థిక కష్టాలను తొలగించుకోండి.
మరికొన్ని ముఖ్య వార్తలు :
ప్రియుడిని ఇంటికి పిలిచి.. ప్రియురాలు ఏం చేసిందో తెలుసా ?
విషాదంలోనూ చిల్లర వ్యక్తుల చేతివాటం..వాటిని కూడా వదలకుండా..!
ఈ ఫొటోల్లో ఉన్న తేడా ఏంటో మీరు చెప్పగలరా ? అలా చేస్తే సులభంగా కనుక్కోవచ్చు..!