Advertisement
సాధారణంగా ఉప్మాను చాలా మంది ఆహారంలో బాగంగా తీసుకుంటారు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే టిఫిన్ ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటారు. ఆ సమయంలో ఈజీగా అయిపోయే ఉప్మాను రెడీ చేసి పిల్లలకు వడ్డిస్తుంటారు తల్లులు. ఇక మన భారతీయులకు ఉప్మాతో విడదీయలేని సంబంధం ఉందనడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఈ ఉప్మాలో కూడా మంచి విశేషమే ఉందండోయ్. ఏదో కడుపు నింపుకోవడానికి ఉప్మా తినేసాం అనుకోకండి. ఉప్మా వల్ల మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా కూరగాయలు వేసి గోధుమ రవ్వతో చేసిన ఉప్మాను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. గోధుమ రవ్వ ఉప్మాలో ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఇలా చాలా రకాల పోషకాలు నిండి ఉంటాయి. అందువల్ల మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఉప్మాను తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది చిరుతిండిపై మనసు మళ్ల కుండా ఉంటుంది. మేటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. దీంతో బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. గోధుమ రవ్వతో చేసే ఉప్మాలో ఐరన్ కూడా ఉంటుంది. ఉప్మా తరచు తీసుకుంటే రక్తహీనత బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉప్మా డైట్ లో ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండెపోటు వచ్చే సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు గోధుమ రవ్వతో తయారుచేసే ఉప్మాను తీసుకుంటే ఎముకలు చాలా దృఢంగా మారుతాయి. అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఈ ఉప్మా లో ఉండే ప్రోటీన్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి ఉప్మానే కదా అని అసలు తీసి పారేయకండి. ఉప్మా తో కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపై ఇంట్లో ఉప్మా చేసినప్పుడు మిస్ కాకుండా ఓ పట్టు పట్టేయండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Advertisement