Advertisement
ప్రస్తుతం చాలామంది వారి యొక్క నటనా టాలెంట్ ను నిరూపించుకోవడానికి సోషల్ మీడియా ను ప్లాట్ఫామ్ గా చేసుకున్నారు.. ఈ విధంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని పెంచుకొని ఒక సోషల్ మీడియా ద్వారానే వారి జీవనాధారం కూడా చేసుకున్నారు.. అందులో ఒకరు టిక్ టాక్ స్టార్ గా పేరుపొందిన దుర్గారావు.. అతను టిక్ టాక్ ద్వారా తనదైన సరికొత్త పర్ఫామెన్స్,డాన్స్ తో అందరినీ అలరించి,నవ్వించి ఫేమస్ అయిపోయారు.. వారు చేసిన “నాది నక్లెస్ గొలుసు” అనే పాటతో దుర్గారావు దంపతులు చాలా ఫేమస్ అయిపోయారు. దీంతో జబర్దస్త్ తో సహా పలు స్టేజీల పై వీరి డాన్స్ పర్ఫార్మెన్స్ తో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారని చెప్పవచ్చు..
Advertisement
ఇవి కూడా చదవండి: లైగర్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి ప్రధానంగా ఈ విషయాలే కారణం..ఏంటంటే..?
Advertisement
అతని డాన్స్ వీడియోలు ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా యూట్యూబ్ లో ట్రెండింగ్ గా కూడా మారుతాయి. ప్రస్తుతం దుర్గారావు సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ గా మారిపోయారు.అతనికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. ఈ క్రమంలోనే ఆయన జబర్దస్త్ తోపాటుగా జీ తెలుగు,స్టార్ మా వంటి ప్రోగ్రామ్లకు రావడంతో అతని జీవితమే మారిపోయిందని చెప్పవచ్చు.. ఈవెంట్స్ కు వారికి భారీగా డబ్బులు ఇచ్చి మరి పిలిపించుకున్నారట.. ఈ ఒక్క దెబ్బతో ఒకప్పుడు బట్టలు కుట్టుకుంటూ డ్యాన్స్ చేసినటువంటి దుర్గారావు నెల సంపాదన నెలకు వేల రూపాయల నుండి లక్షల రూపాయలకు చేరిందని తెలుస్తోంది.
కొన్ని బ్రాండ్స్ వారికి ప్రమోషన్స్ దుర్గారావు తో చేయిస్తున్నారని, ఆ ఆదాయంతో పాటుగా యూట్యూబ్ ఛానల్ నుంచి అతనికి ప్రతి నెల డ్యాన్స్ ద్వారా 50 వేల వరకు సంపాదన వస్తుందని, ఇలా తన విలక్షణమైన డాన్స్ దుర్గారావుని లక్షాధికారిని చేసిందని అంటున్నారు.. టాలెంట్ ఉంటే ఎలాగైనా సక్సెస్ కావచ్చని దుర్గారావు ని చూస్తే అర్థం చేసుకోవచ్చు.
ALSO READ: గురువారాన్ని ‘బేస్తారం’ అని ఎందుకంటారు?