Advertisement
ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ సినిమాతో పాటు వినోదయ సీతం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలని లైనప్ చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే తాజాగా జనవరి 30న యంగ్ డైరెక్టర్ సుజిత్ తో “ఓజి” మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ ఓపెనింగ్ డే కి టాలీవుడ్ నుండి చాలామంది పెద్దలు వచ్చి మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆర్ఆర్ఆర్ తరువాత దానయ్య నిర్మిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Advertisement
Read also: డబుల్ సెంచరీ సాధించిన ఈ ఆటగాళ్లలో ఉన్నా కామన్ పాయింట్ ఎంత మంది గమనించారు ?
Advertisement
ఈ సినిమాకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించనుండగా.. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే అయ్యారు. అయితే ఈ మూవీ పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కనిపించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వాచ్ పైనే ఫోకస్ పెట్టారు అభిమానులు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ నీ ఉద్దేశించి సమంత చెప్పే ఓ డైలాగ్ ఉంటుంది. “వాడి వాచ్ అమ్మితే నీ బ్యాచ్ మొత్తం సెటిల్ అయిపోతుంది” అని పవర్ స్టార్ రేంజ్.
Read also: మా అన్న పెళ్లి చూసుకోవాల్సిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను ! అటు తరువాత ఏమయ్యిందంటే ?
మరి పవన్ ధరించిన వాచ్ కంపెనీ ఏంటి? దాని ధర ఏంటి అనే వివరాలు ఆరా తీసే పనిలో ఉన్నారు అభిమానులు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ ” పనేరాయ్” అనే ప్రముఖ కంపెనీకి చెందినది. దీని ధర 13.52 లక్షలు అని సమాచారం. అభిమానులు పవన్ ధరించిన ఈ వాచ్ బ్రాండ్ ను ఆన్లైన్లో సెర్చ్ చేయగా దాని ధర చూసి షాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కి సంబంధించిన ఈ వాచ్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు.
Read also: నెట్ లో వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లిపత్రిక చూసారా ? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారంటే ?