Advertisement
సాధారణంగా ఇప్పుడున్న సమాజంలో పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి అబ్బాయి జాతకాలు కలిస్తేనే వివాహం చేసుకుంటున్నారు.. అయితే వివాహ విషయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని అంటూ ఉంటారు.. నిజంగానే మూల నక్షత్రం లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయా?
Advertisement
లేదా ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. శాస్త్రపరంగా చూసుకున్నట్లయితే మూలా నక్షత్రంలో పుట్టిన స్త్రీని వివాహం చేసుకుంటే చాలా అదృష్టవంతుడని శాస్త్ర నిపుణులు అంటున్నారు. కొంతమంది బయట తెలిసి తెలియక మూలనక్షత్రంలో చేసుకున్న వారి ఇంట్లో అలా జరిగిందని లేనిపోని అపోహలు పుట్టిస్తూ ఉంటారు..
ALSO READ:పాటల రచయిత “చంద్రబోస్” భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !
Advertisement
ఒకవేళ వారు అనుకున్నట్లే జరిగి ఉంటే ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి పుట్టగానే వారి కుటుంబానికి ఏదో ఒకటి జరగాలి.. లేదంటే ఆమె చదువు సంధ్యా ఏది లేకుండా అనేక ఇబ్బందుల పాలు కావాలి. కానీ ఎందుకు కాలేదు.. ఆ నక్షత్రంలో పుట్టిన కొంతమంది అమ్మాయిలు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు..వారి తల్లిదండ్రులు వారికి అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తున్నారు.. మరి మూల నక్షత్రంలో వారు పుట్టడం వల్ల ఎవరికి సమస్య వచ్చింది.. పెళ్లి చేసుకుంటే సమస్య ఎందుకు వస్తుంది.. అనే విషయాలను ఆలోచించుకోవాలి..
ఎవరో అనవసరమైన రాద్ధాంతాన్ని క్రియేట్ చేసి పెట్టడం వల్ల చాలామంది మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకోకుండా లేనిపోని అపోహలు నమ్ముతున్నారని కొంతమంది శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే మూల,ఆరుద్ర,జేష్ఠ నక్షత్రాలతో కలిసి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి.. కొంతమంది చెప్పిన దాని ప్రకారమే ఈ మూడు నక్షత్రాలు కలిగిన వారిని పెళ్లి చేసుకుంటే నష్టం వస్తుందని భావించారు అనుకోండి.. మరి ఇంకా 24 నక్షత్రాలలో పెళ్లి చేసుకున్న వారంతా సుఖంగా ఉంటున్నారా? వారికి ఏ సమస్యలు రావడం లేదా? అనేది కూడా మనం చూసుకోవాలి.. ఇదంతా అనవసర రాద్ధాంతం మనిషికి ప్రశాంతత,కష్టపడే గుణం ఉంటే ఏ నక్షత్రం లో పుట్టినా వారి జీవనం బాగానే ఉంటుందనేది కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణుల మాట.
ALSO READ:Krishna Vrinda Vihari : ‘కృష్ణ వృంద విహారి’ రివ్యూ