Advertisement
సాధారణంగా మనం అప్పుడప్పుడు క్యారెట్ ని తింటుంటాం. ఈ క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తెలియక చాలామంది క్యారెట్ ని తినకుండా ఉంటారు. మనం తినే దుంపల్లో అద్భుతమైన దుంప క్యారెట్ అనే చెప్పవచ్చు. ఈ క్యారెట్ కళ్ళకు చాలా మేలు చేస్తుంది. అంతేకాదు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. అదేవిధంగా చర్మ సౌందర్యానికి జుట్టు సంరక్షణకు కూడా క్యారెట్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా రోజు క్యారెట్ ని తీసుకున్నట్టయితే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.
Advertisement
ముందుగా ఓ పెద్ద క్యారెట్ ని తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడగాలి. ఇక ఆ తరువాత లైట్ గా పైపైన గీకాలి. ఆ తర్వాత క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్లైండర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అర అంగుళం పొట్టు తొలగించిన పచ్చి పసుపు కొమ్ము, ఆ రంగులం పొట్టు తొలగించిన అల్లం ముక్క, ఒక గ్లాసు వాటర్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రాండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సాయంతో ఫిల్టర్ చేసి తాగేయడమే. రోజు ఈ విధంగా క్యారెట్ జ్యూస్ ని తయారు చేసుకొని తీసుకుంటే మీ యొక్క శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు అన్ని తొలగిపోతాయి. భారీ డీటేక్స్ అవుతుంది కంటి చూపు మెరుగవుతుంది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ చాలా తగ్గుతుంది మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కరుగుతుంది.
Advertisement
గుండె ఆరోగ్యంగా మారుతుంది ఎముకలు దృఢపడతాయి. ఆడవారిలో నెలసరి సమస్యలు దూరం అవుతాయి దంపతుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యము పెరుగుతుంది. ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. బరువు కూడా తగ్గుతారు. శరీర భాగాల్లో ఎక్కడైనా పుండ్లు ఏర్పడితే లేదా గాయాలు కూడా త్వరగా మానుతాయి. జుట్టు రాలడము తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. చర్మం యవ్వనంగా కాంతివంతంగా తల తల మెరుస్తుంది. కాబట్టి క్యారెట్ ని తీసుకోవడంలో అసలు నిర్లక్ష్యం చేయకండి. తప్పకుండా ఈ విధంగా క్యారెట్ తో జ్యూస్ తయారు చేసుకొని తీసుకునేందుకు ప్రయత్నించండి. మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవిస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నం చేయండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
కీళ్ల నొప్పులు రోజు రోజుకు పెరుగుతున్నాయా ? అయితే ఇలా చేస్తే మటు మాయం..!