Advertisement
బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా బిగ్ బాజ్ ఏడో సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ సీజన్ చాలా ఉల్టా పుల్టా ఉంటుందని నాగార్జున చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ విధంగానే ఈసారి బిగ్ బాస్ సెవెన్ చాలా వెరైటీగా ముందుకు వెళ్తోంది. ఈ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. వారు వచ్చి వారం రోజులు అవుతుంది. దీంతో మూడు గొడవలు, ఆరు ఏడుపులుగా తయారైంది బిగ్ బాస్ హౌస్. లవ్ స్టోరీస్ కూడా నడుస్తున్నాయి. అలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మరో వార్నింగ్ ఇచ్చారు నాగార్జున అదేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
నాగార్జున కంటెస్టెంట్ శోభ శెట్టికి వార్నింగ్ ఇచ్చారు. మొదటి వారం నుంచి కన్నీరు పెట్టుకుంటున్నావ్. ఇలాంటి కంటెస్టెంట్లను ఆడియన్స్ ఎప్పటికీ కూడా టాప్ 5కి పంపించరు అని శోభా శెట్టితో అన్నారు. అలా నాగార్జున ఎవరు హౌస్ లో ఏడవకూడదని ఇన్ డైరెక్ట్ గా చెప్పారని అర్థమవుతుంది. రతికతో పల్లవి ప్రశాంత్ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు.
ఆమె చుట్టూ ప్రశాంత్ తిరగడం నాగార్జున గుర్తు చేస్తూ ప్రశాంత్ ను ఆట పట్టించారు. నీకు స్టేజ్ మీద హౌస్ లోకి వెళ్లేముందు మిరప మొక్క గిఫ్ట్ గా ఇచ్చాను కదా దాన్ని ఎంతసేపు చూసుకుంటున్నావ్.. నీ లేడీలక్ ను ఎంతసేపు చూసుకుంటున్నావని నాగార్జున అన్నారు. దండం పెట్టుకుంటున్నాను అంటూ చాలా వెరైటీ సమాధానం ఇచ్చారు ప్రశాంత్. ప్రస్తుతం నాగార్జున అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.