Advertisement
భారతదేశం అంటేనే దేవాలయాలకు పుట్టినిల్లు.. ఇక్కడ చాలామంది ప్రజలు గుళ్లను, దేవుళ్లను నమ్ముతుంటారు. గుడికి వెళ్లి దేవున్ని ప్రార్ధించి తమ కోరికలు తీరాలని దండం పెడతారు.. ఇదంతా జరిగేది తంతే కానీ రాజస్థాన్ లోని రణథంబోరులో వినాయక దేవాలయం లో మాత్రం భక్తుల మొక్కులు చాలా విభిన్నంగా ఉంటాయి. దేవుడికి ఉత్తరాలు రాస్తూ వారి కోరికలను చెబుతారు. కోరికలు కోరడమే కాకుండా ఇంట్లో జరిగే శుభకార్యాలకు గణేశున్ని ఆహ్వానిస్తూ ఉత్తరాలు పంపుతారు. ఆ కోరికలు నెరవేరిన కొంత మంది భక్తులు కృతజ్ఞతలు చెబుతూ ఉత్తరాలు రాస్తూ ఉంటారు.
Advertisement
ALSO READ: కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు బిగ్ స్కెచ్ !
ఆలయానికి రోజుకు ఇరవై కేజీలకు పైగా ఉత్తరాలు వస్తాయట. వీటన్నింటిని పూజారులు చాలా ఓపిగ్గా దేవుడి ముందు చదివి వినిపిస్తారట. ఆ తర్వాత దేవుడి పాదాల వద్ద అవి ఉంచుతారట.. అలా దేవుడికి ఉత్తరం రాస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.. అయితే ఈ దేవాలయాన్ని పదవ శతాబ్దంలో హమీర్ అనే రాజు నిర్మించాడని, ఆ కాలంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ అనే రాజుతో యుద్ధం జరుగుతున్న సమయంలో హమీర్ రాజ్యంలోని ఖజానా అంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ విధంగా ఏడేళ్లపాటు యుద్ధం జరిగగా తనకు ఓటమి తప్పదని అనుకుంటాడు హమీర్.. కానీ ఆయన గొప్ప వినాయక భక్తుడు. ఒకరోజు హమీర్ కలలో వినాయకుడు కనిపించి తెల్లారితే యుద్ధం ఆగిపోతుంది, నువ్వే గెలుస్తావ్ అని చెప్పి నీ సమస్యలు తొలగిపోతాయని అన్నారట..
Advertisement
ఆ మరుసటి రోజు గణేశుడు కనిపించి చెప్పిన మాటలు నిజమయ్యాయి.. అంతేకాకుండా హమీర్ కోట గోడకు చెక్కిన శిల్పం లా విఘ్నేశ్వరుడి ప్రతిమ వెలసిందట. ఆ విగ్రహానికి మూడు కళ్ళు ఉన్నాయట.. హమీర్ విగ్రహాన్ని చూసిన వెంటనే అక్కడ ఒక గుడి నిర్మించారు.. ఆ గుడి ఇప్పుడు వేలాది మంది భక్తులకు కొంగు బంగారంగా మారింది. వినాయకుడికి మూడు కన్నులు ఉండటంవల్ల త్రినేత్ర విఘ్నేశ్వరుడు అని పిలుస్తుంటారు. ఆ దేవాలయమే రణతంబోర్ దేవాలయం.. మీరు కూడా మీ కోరికలను ఉత్తరాలుగా పంపాలనుకుంటే ఈ చిరునామాకు పంపేయండి: రణతంబోర్ త్రినేత్ర గణేష్ టెంపుల్, సవాయి మధోపూర్, రాజస్థాన్ -322021
ALSO READ: