Advertisement
మెగాస్టార్ చిరంజీవి పై గతంలో విష ప్రయోగం జరిగిందనే విషయమే చాలామందికి తెలియదు. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. 1988లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు సిని ఇండస్ట్రీలో మూడు హిట్ లు కొట్టి నెంబర్ వన్ హీరోగా చిరు ఎదిగాడు. మరణం మృదంగం చిత్రీకరణలో చిరు పాల్గొంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.
Advertisement
ఆ రోజు మద్రాస్ బేస్ కోర్టులో షూటింగ్ జరుగుతోంది. అక్కడికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. అందులో ఒక అభిమాని ఈరోజు నా పుట్టినరోజు అంటూ ఎప్పటినుంచో మీ సమక్షంలో కేక్ కట్ చేయాలని అనుకుంటున్నాను అంటూ చిరంజీవికి చెప్పాడు. అభిమాని అలా చెప్పడంతో చిరు కూడా ఏం మాట్లాడకుండా ఓకే అన్నాడు. ఒక కేక్ ముక్క కట్ చేసిన అభిమాని దానిని వెంటనే చిరుకి బలవంతంగా తినిపించబోయాడు. తనకు వద్దని చిరు వారించిన కూడా అతడు వినకుండా చిరు నోట్లోనే కేక్ పెట్టేందుకు ప్రయత్నించాడు. దాంతో కేక్ అంత నేల పాలైపోయింది.
Advertisement
అలా నేలపైన పడిన ఆ కేక్ ముక్కలో గోధుమ రంగులో ఓ చిన్న ప్యాకెట్ బయటపడింది. దాంతో మరణం మృదంగం చిత్ర యూనిట్ కంగారు పడింది. కేక్ తిన్న వెంటనే చిరంజీవి పెదాల రంగు కూడా మారిపోయింది. దాంతో విష ప్రయోగం జరిగి ఉంటుందని భావించి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత రోజు రాష్ట్ర, జాతీయ న్యూస్ పేపర్లలో మొదటి పేజీల్లో చిరుపై విషప్రయోగ యత్నం అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఈ ఘటన నాడు హట్ టాపిక్ అయ్యింది. చిరు ఎదుగుదలను సహించలేని వారి కుట్ర అంటూ ప్రచారం సాగింది. ఆ తర్వాత సినీ పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు చిరంజీవి ఎన్ని కష్టాలు పడి ఎన్ని అవరోధాలు దాటి మెగాస్టార్ అయ్యాడో చెప్పడానికి.
Read also : నరసింహ సినిమా లో నీలాంబరి క్యారెక్టర్ ను వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..?