Advertisement
ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగా పాన్ కార్డు కూడా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. అందుకే ప్రతి ఒక్కరూ పాన్ కార్డు కలిగి ఉండటం ఉత్తమం. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డులను జారీ చేసింది. మీరు ఆన్లైన్ లోనే పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డు ఉంటే చాలు నిమిషా ల్లో పాన్ కార్డు పొందొచ్చు.
Advertisement
READ ALSO : నెపోటిజంపై విజయ్ దేవరకొండకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండ్లన్న?
ఈ పాన్ కార్డును నిమిషాల్లో తీసుకోవచ్చు. ఎన్ ఎస్ డి ఎల్, యు టి ఐ ఐ టి ఎస్ ఎల్ వెబ్సైట్ లో ద్వారా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే పాన్ కార్డు ఇంటికి రావాలంటే వారం రోజులు పడుతుంది. ఇకపోతే పాన్ కార్డు కలిగిన వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఫేక్ పాన్ కార్డుల గురించి తెలుసుకోవాలి. మోసగాళ్లు ఫేక్ పాన్ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతుంటారు. అందువల్ల ఈ విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి.
Advertisement
మీ పాన్ కార్డు లేదంటే మీ వద్ద ఉన్న పాన్ కార్డు నిజమైందా? కాదా? అని సులభంగానే తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ కు వెళ్లాలి. అక్కడ వెరిఫై పాన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి పాన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ పాన్ నంబర్ మనుగడలో ఉందో, లేదో తెలిసిపోతుంది. ఈ లింకు ద్వారా మీ పాన్ కార్డు నిజమైందో కాదో తెలుసుకోండి.
READ ALSO : ఉత్తమ్ సింగ్, సూర్యనారాయణ టైటిల్, పోకిరిగా ఎలా మారింది? దాని వెనుకున్న స్టోరీ ఇదే.