Advertisement
2007 లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను టీమిండియా అభిమానులు ఎన్నటికీ మరిచిపోరు. ఎటువంటి అంచనాలు లేకుండా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లు లేకపోయినా, యువజట్టుతో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా ఏకంగా ప్రపంచ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్ లో పాకిస్తాన్ విజయం సాధించడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఆ టోర్నీలో భారత్, పాక్ లు రెండుసార్లు తలపడతాయి. మొదట గ్రూపు మ్యాచ్ లో, ఆ తర్వాత మళ్లీ ఫైనల్ లో ఈ రెండు సార్లు కూడా టీమిండియాదే విజయం. గ్రూపు దశలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన పోరు టై కావడంతో విజేతను తేల్చేందుకు బౌలౌట్ ను నిర్వహిస్తారు. అయితే ఈ బౌలౌట్ లో టీమిండియా అంత ఈజీగా గెలవడానికి పాక్ ను దారుణంగా ఫెయిల్ అవ్వడం వెనుక ఒక మాస్టర్ బ్రెయిన్ ఉంది. అదే మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.
Advertisement
అప్పటివరకు లాంగ్ హెయిర్ తో హెలికాప్టర్ షాట్లను అలరించే కుర్ర క్రికెటర్ గా మాత్రమే ధోని అందరికీ తెలుసు. కానీ, పాక్ తో బౌలౌట్ తర్వాత ధోని ఒక మాస్టర్ పీస్ అనే విషయం ప్రపంచానికి అప్పుడే తెలిసి వచ్చింది. బౌలర్లు వికెట్లను హిట్ చేసేందుకు వచ్చిన టైం లో ధోని ఒక ప్లాన్ ప్రకారం వికెట్లకు కాస్త దగ్గరగా, కచ్చితంగా వికెట్లకు వెనకాల మోకాళ్లపై నిలుచున్నాడు. దీంతో మనోళ్ళు ముగ్గురు కూడా గురి తప్పకుండా వికెట్లను గిరాటేశారు. కానీ, పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ మాత్రం ఎప్పటిలాగే వికెట్లకు ఆఫ్ సైడ్ కొంత పక్కన జరిగి, చాలా దూరంలో నిలుచుంటాడు. ఇది పాక్ బౌలర్ల ఫోకస్ ను పక్కదారి పట్టిస్తుంది. వాళ్లు వికెట్లను వదిలేసి కమ్రాన్ అక్మల్ వైపు బాల్ వేస్తారు. ఉమర్ గుల్, ఆర్ఫత్ ఇద్దరూ సేమ్ తప్పిదంతో వికెట్లను మిస్ అవుతారు. ఇక ఆఫ్రిది అయితే ఏకంగా వైడ్ తో దారుణంగా మిస్ అవుతాడు. ఇక్కడ పాక్ కీపర్ ఆక్మల్, ధోని మధ్య చిన్న తేడానే ఉంది. అదే టీమిండియాకు టి20 వరల్డ్ కప్ లో తొలి విజయం అందించి, ఆ తర్వాత టి 20 ఛాంపియన్ గా నిలిపింది.
Advertisement
ఈ విజయంతో ధోనిలోని ఒక కొత్త కోణం ప్రపంచానికి తెలుసొచ్చింది. కెప్టెన్ గా తాను ఏం చేయగలడో ఆ బౌలౌట్ తో చిన్న ట్రైలర్ చూపించాడు. అక్కడి నుంచి ఇండియన్ క్రికెట్ లో ధోని శకం మొదలైంది. క్రికెట్ ను మైండ్ గేమ్ గా మార్చేశాడు. ఫైనల్ లో కూడా చివరి ఓవర్ ను జోగిందర్ శర్మతో వేయించి మిస్బా ను బోల్తా కొట్టించాడు. తొలి మ్యాచ్ లో పాక్ ను బౌలౌట్ చేయించిన ధోని, ఫైనల్ లో ఆల్ అవుట్ చేయించాడు. ముఖ్యంగా బౌలౌట్ లో ఎవరి అర్థం కాకుండా, చిన్న ట్రిక్ తో పాకిస్తాన్ ను ఎర్రిపప్పలను చేసిన విధానం అయితే, ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ధోని మాత్రమే ఇలా ఆలోచించగలడేమో అనిపిస్తుంది. అనిపించడం కాదు, అదే నిజం.
Read also : ఆ క్లిష్ట పరిస్థితుల్లో బాహుబలిని..రాజమౌళి ఆపేద్దాం అనుకున్నారా..?