Advertisement
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అసాధారణ పోరాటంతో భారత్ కు విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆఖరిలో విరాట్ చెలరేగిన తీరు చూసి మెల్బోర్న్ స్టేడియంలోని 90,000 మంది ప్రేక్షకులు తమను తాము మర్చిపోయారు. ఆసియా కప్ ముందు వరకు రెండేళ్లకు పైగా ఫామ్ లేమితో సతమతం అయినా కోహ్లీ, పాకిస్తాన్ పై తన కెరీర్ లోనే బెస్ట్ అనాధగ్గ ఇన్నింగ్స్ తో మళ్ళీ పునర్వైభవాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా, ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ వీడియో లీక్ ఘటన క్రీడా వర్గాలను విస్మయానికి గురిచేసింది.
Advertisement
Advertisement
ఓ వ్యక్తి ఏకంగా కోహ్లీ గదిలోకి వెళ్లి కెమెరాతో చిత్రీకరించి అతని గోప్యతకు భంగం కలిగించిన తీరు చర్చకు దారితీసింది. ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించిందంటూ హోటల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై కోహ్లీ, అతడి సతీమణి అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం తాను ఈ ఘటనతో షాక్ కు గురైనట్లు పేర్కొన్నాడు. ఇక కోహ్లీ సోదరుడు వికాస్, “ఇది అనైతికం. నాకు తెలిసి ఇది హోటల్ స్టాఫ్ పని అయి ఉంటుంది. అయినా అతిధులకు కనీస భద్రత కల్పించలేని మేనేజ్మెంట్ ఎందుకు? ” అంటూ సదరు హోటల్ తీరును తప్పుపట్టాడు.
ఈ నేపథ్యంలో కోహ్లీ బస చేసిన క్రౌన్ రిసార్ట్స్ యాజమాన్యం స్పందించింది. విరాట్ కోహ్లీకి క్షమాపణలు తెలిపింది. ఈ మేరకు “అతిధుల భద్రత, గోప్యతే మాకు అత్యంత ప్రాధాన్యమైనది. ఈ ఘటన మమ్మల్ని నిరాశకు లోను చేసింది. మా గెస్ట్ కు మేము బెషరతుగా క్షమాపణలు తెలుపుతున్నాం. ఈ ఘటనపై విచారణకు పూర్తి సహకారం అందిస్తాం” అని సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
Read Also : తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే