Advertisement
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 15, 2023న అహ్మదాబాద్ లో భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ తేదీ మారే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ ఈ మ్యాచ్ ని రీ షెడ్యూల్ చేసే అవకాశముంది. ఇందుకు ప్రధాన కారణం దేవి నవరాత్రి ఉత్సవాలు. అక్టోబర్ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవరాత్రి సందర్భంగా గుజరాత్ లో వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఇక అదే రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్లు ఢీ కొనబోతున్నాయి. ఈ విషయం ఇప్పుడు బీసీసీఐ దృష్టికి ఐసీసీ తీసుకెళ్లినట్టు సమాచారం.
Advertisement
ఇప్పటికే చాలా మంది భారత్-పాక్ మ్యాచ్ కోసం టికెట్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మ్యాచ్ రీ షెడ్యూల్ విషయాన్ని పరిశీలిస్తున్నామని.. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.నవరాత్రి ఉత్సావాల సమయంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ నిర్వహిస్తే సమస్యలు తలత్తే అవకాశం ఉందని భద్రతా సంస్థలు హెచ్చిరించనట్టు తెలిపారు.
Advertisement
గత నెలలోనే వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ని బీసీసీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. లక్ష మంది ప్రేక్షకులతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ తో పాటు ఇక్కడ మరో 3 మ్యాచ్ లు జరగాల్సి ఉండగా.. న్యూజిలాండ్ Vs ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా Vs ఇంగ్లాండ్ మ్యాచ్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కే జరగాల్సి ఉంది. మరోవైపు ప్రపంచకప్ ను నిర్వహించనున్నారు. ప్రపంచ కప్ నిర్వహించే క్రికెట్ సంఘాలకు బీసీసీఐ సెక్రటరీ జై షా లేఖ రాస్తూ జులై 27న ఢిల్లీలో సమావేశం జరుగనుంది. ఈ భేటీలో భారత్-పాక్ మ్యాచ్ పై చర్చ జరుగుతుందని.. కొత్త తేదీని కూడా నిర్ణయించే అవకాశముందని సమాచారం.