Advertisement
కీలకమైన టీ-20 మ్యాచ్ లో కుర్రోళ్లు కుమ్మేశారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ-20లో అద్భుతమైన విజయం సాధించారు. దీంతో 2-1 తేడాతో సిరీస్ భారత్ వశమైంది. అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు అద్భుతంగా రాణించి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.
Advertisement
ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచింది కివీస్. అయితే.. రెండో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ కొట్టాలనుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లింది పాండ్యాసేన. రెండో మ్యాచ్ లో టీమిండియా గెలవడంతో మూడో మ్యాచ్ కీలకమైంది. కానీ, ఏ దశలోనూ కివీస్ పోటీనివ్వలేకపోయింది.
Advertisement
తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు భారత ఆటగాళ్లు. శుభ్‌మన్ గిల్(126) సెంచరీ బాదడంతో టీమిండియా 20ఓవర్లకు 234 రన్స్ చేసింది. రాహుల్ త్రిపాఠి(44), సూర్యకుమార్(24), పాండ్యా (30) రాణించారు. ముఖ్యంగా గిల్ విధ్యంసక ఇన్నింగ్స్ అందర్నీ ఆకట్టుకుంది. పొట్టి క్రికెట్ లో తొలి శతకం నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి.
235 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు భారత బౌలర్ల ధాటికి విలవిలలాడారు. ఆశ్చర్యంగా ఈ మ్యాచ్ లో పేసర్లు చెలరేగారు. వెంట వెంటనే వికెట్లు తీస్తూ కివీస్ ను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో 66 పరుగులకే కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఇక ఇదే పర్యటనలో న్యూజిలాండ్.. భారత్ చేతిలో వన్డే సిరీస్ ను 0-3 తేడాతో ఓడిపోయింది. ఇటు టీమిండియా తర్వాత.. ఆసీస్ తో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.