Advertisement
చాలా మంది దూర ప్రయాణాలు చేయడానికి ట్రైన్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ట్రైన్ ఈజీగా ఉంటుంది. చాలా మంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అయితే మీరు ట్రైన్లో అప్పుడిప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకుండా చూసుకోవాలి. రైల్వే నిబంధనల ప్రకారం రైలు లోపల పేలుడు లేదా మండే వస్తువులు తీసుకెళ్లడం నిషేధం.
Advertisement
అటువంటి పరిస్థితుల్లో పటాకులు, కిరోసిన్, ఆయిల్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ఇటువంటివి తీసుకెళ్లి పట్టుబడితే రైల్వే చట్టం 1989 సెక్షన్ 164 ప్రకారం రూ. 1000 జరిమానా మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించవచ్చు. అలాగే రైలు ప్రయాణంలో ప్రయాణికులు రాత్రి పూట నిద్రపోతున్న సమయంలో టికెట్లు కూడా తనిఖీ చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తమ తోటి ప్రయాణికులు నిద్రకు ఆటంకం కలగకుండా ఉండాలని రైల్వే భావిస్తోంది. కాబట్టి ఇతరులకి ఎలాంటి ఇబ్బందుల్ని రాత్రి పూట కలిగించకూడదు.
Advertisement
Also read:
Also read:
అలానే ధూమపానం చేయడం కూడా చాలా తప్పు. మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించబడుతుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ మంది రైళ్లలో రిజర్వ్ చేయబడిన కంపార్ట్మెంట్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు రాత్రి ప్రయాణంలో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే జరిమానా విదించొచ్చు. జైలు శిక్ష కూడా పడొచ్చు. అలాగే తప్పుడు కంపార్ట్మెంట్లో ప్రయాణించడం కూడా తప్పు. చాలా మంది ప్రయాణికులు జనరల్ లేదా స్లీపర్ కోస్ టికెట్లు తీసుకుని ఏసీ కోచ్ లో ప్రయాణిస్తారు అలా చేస్తే కూడా జరిమానా విధిస్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!