Advertisement
ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ లో కప్పు కొట్టడమే లక్ష్యంగా టీమిండియా పోరాడుతోంది. మొదటి రెండు మ్యాచ్ల్ లో అద్భుత విజయాలు నమోదు చేసిన భారత్ సౌత్ ఆఫ్రికా పై పరాజయం పాలైం.ది ఈ వరల్డ్ కప్ తర్వాత కూడా టీమిండియా విశ్రాంతి లేకుండా సిరీస్ లు ఆడుతోంది. అయితే ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. టీమిండియా కివీస్ తో భారత జట్టు మూడు వన్డేలు, మూడు t20 లు ఆడుతుంది. ఈ మేరకు టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనుండగా, t20 లకు హార్దిక్ పాండ్యా ఆ బాధ్యతలను మోయనున్నాడు. న్యూజిలాండ్ తో పాటు డిసెంబర్ లో జరగబోయే బంగ్లాదేశ్ పర్యటనకు కూడా జట్టును ప్రకటించింది బీసీసీఐ.
Advertisement
ప్రపంచ కప్ లో ఆడుతున్న టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్, అశ్విన్ లకు కివీస్ పర్యటనలో విశ్రాంతి దక్కింది. t20 ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోలేకపోయినా సంజు శాంసన్ తో పాటు, జమ్మూ ఎక్స్ప్రెస్ ఇమ్రాన్ మాలిక్ కు వన్డే t20 జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్ తో వన్డే t20 సిరీస్ లలో రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. నవంబర్ 18న మొదలయ్యే న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు తోలుత మూడు టి20 ఆడుతుంది. నవంబర్ 18, 20, 22న ఈ మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 25, 30న టీమిండియా కివీస్ తో మూడు వన్డేలు ఆడనుంది.
బంగ్లాదేశ్ తో టెస్టు, వన్డే లకు జట్టు ఎంపిక,
Advertisement
కివిస్ పర్యటన తర్వాత భారత జట్టు అక్కడి నుంచి నేరుగా బంగ్లాదేశ్ కు చేరుకుంటుంది. ఈ పర్యటనను భారత్, డిసెంబర్ 4న మొదలయ్యే తొలి వన్డే తో ప్రారంభించనుంది. డిసెంబర్ 7న రెండో వన్డే, 10న మూడో వన్డే జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్, 22 నుంచి 26 వరకు రెండో టెస్టు జరుగుతాయి. ఈ సిరీస్ కు భారత్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతుండటం గమనార్హం.
బంగ్లాదేశ్ వన్డేలకు జట్టు:
రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్ (విసి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికె), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, డబ్ల్యూ సుందర్, శార్దూల్ ఠాకూర్ , Mohd. షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్
బంగ్లాదేశ్ టెస్టుల జట్టు:
రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్ (విసి), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికె), కెఎస్ భరత్ (వికె), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , Mohd. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్.
Read also : కోహ్లీకి షాకింగ్ అనుభవం.. విరాట్ లేని సమయంలో బెడ్ రూంలోకి వెళ్ళి..!
🚨 NEWS 🚨: India’s squads for series against New Zealand and Bangladesh announced. #TeamIndia | #NZvIND | #BANvIND
More Details 👇https://t.co/YsToGDBozi
— BCCI (@BCCI) October 31, 2022