Advertisement
ఆసియా కప్ కి ముందు టీమిండియాకి ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గాయం కారణంగా కొద్ది నెలల నుంచి జట్టుకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కే.ఎల్. రాహుల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. 31 ఏళ్ల స్టార్ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ కి కూడా అందుబాటులోకి ఉంటాడని సమాచారం. ఈ రెండు ప్రతీష్టాత్మక టోర్నీలకు కీపర్ అండ్ బ్యాటర్ గా కే.ఎల్.రాహుల్ ఫస్ట్ ఛాయిస్ అని తెలుస్తుంది. మే 01న లక్నోలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు రాహుల్. ఇక ఆ తరువాత శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు.
Advertisement
ప్రస్తుతం కర్ణాటక బ్యాటర్ పూర్తిగా ఫిట్ నెస్ సాధించాడు. జట్టు ఎంపికకు కూడా అందుబాటులో ఉన్నాడు. ఆసియా కప్ లోనే కే.ఎల్.రాహుల్ టీమిండియాకి తిరిగొచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆగస్టు 30న ముల్తాన్ లో పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ మధ్య మ్యాచ్ తో ఆసియా కప్ 2023న ప్రారంభం అవుతుంది. టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరుగనుంది. సెప్టెంబర్ 02న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది.
Advertisement
కే.ఎల్.రాహుల్ టీమిండియాలోకి పునరాగమనం చేయడం జట్టుకు చాలా ఊరటనిస్తుంది. వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషబ్ పంత్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు రాహుల్ రీ ఎంట్రీ జట్టులో మిడిల్ ఆర్డర్ ని బలోపేతం చేయడమే కాకుండా వికెట్ కీపింగ్ కూడా చేయనున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న రాహుల్.. కోచ్, వైద్యుల సలహా మేరకు బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. రాహుల్ స్వయంగా తన ప్రాక్టిస్ సెషన్ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుంటున్నాడు.