Advertisement
Reason Behind Krishna Second Marriage: టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తన సినీ ప్రస్తానానికి సెలవు పెట్టి తిరిగిరాని లోగాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ అతి తక్కువ కాలంలోనే నటశేఖరుడిగా ఎదిగారు. మాస్ హీరోగా, క్లాస్ హీరోగా, సూపర్ స్టార్ గా ఎదిగినతీరు అనిర్వచనీయం. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సి సుందరం నిర్మాతగా బాబు మూవీస్ తిరిగిన తేనె మనసులు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు సూపర్ స్టార్ కృష్ణ. మొదటి సినిమాతోనే అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని హీరోగా కృష్ణకు మంచి పేరుని తెచ్చిపెట్టింది ఈ చిత్రం.
Advertisement
Read also: జీవిత భాగస్వామిని ఇలా ఎంపిక చేసుకోకుంటే జీవితం లో కష్టాలు తప్పవట !
Advertisement
ఈ సినిమా సమయంలోనే కృష్ణ తన మరదలు అయిన ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి తనతో పాటు సినిమాలలో కలిసి నటించిన విజయనిర్మలను వివాహం చేసుకున్నాడు కృష్ణ. దానికి కారణం వారి ఇష్ట ఇష్టాలు, అభిప్రాయాలు అన్నీ ఒకటై దాంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వీరిద్దరికీ ఎప్పటికీ పెళ్లి అయిపోయినా కూడా వీరి మధ్య ప్రేమ చిగురించి రెండో పెళ్లికి దారితీసింది. రెండో పెళ్లి చేసుకునే విషయంలో ఇందిరా దేవిని కృష్ణ ఒప్పించడంతో గొడవ మొత్తం సద్దుమణిగింది. తిరుపతిలో శ్రీవారి సమక్షంలో వీరు ఇరువురు పెళ్లి చేసుకున్నారు.
Krishna Second Marriage
అయితే కృష్ణ మాటను గౌరవించి ఇందిరాదేవి ఎలాంటి గొడవ చేయకుండా మౌనమే అర్ధాంగికారం అన్నట్లుగా ఉండిపోయారట. కృష్ణ రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఇందిరా దేవి ఆయనతో విడాకులు తీసుకోలేదు. పిల్లల బాధ్యతలు చూసుకోవడం జరిగింది. ఇందిరా దేవి విజయనిర్మలతో చక్కగా ఉండేవారు. మూవీ ఫంక్షన్లలో కూడా కలుసుకునేవారు. ఇక ఏ సినిమా ఫంక్షన్ అయినా కృష్ణ – విజయనిర్మల కలిసి వచ్చేవారు. ఇక కృష్ణకు విజయనిర్మల వెన్నెముక అని తెలుసుకొని ఒప్పుకున్నారు. అయితే కృష్ణ విజయనిర్మలతో పిల్లలని కనడానికి మాత్రం నో చెప్పారట. ఆ కండిషన్ తోనే పెళ్లి చేసుకున్నారు.