Advertisement
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి అలనాటి హీరోయిన్లలో ఎంతమంది ఉన్నా హీరోయిన్ ఇంద్రజకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. తన నటనతోనే కాకుండా అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించి మరెంతో అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ఈమె దాదాపు 80 కి పైగా చిత్రాలలో నటించింది. కేరళలో ఓ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఇంద్రజ. ఈమె అసలు పేరు రజతి. పాఠశాలలో చదువుకునే రోజులలోనే సంగీత, నాటక పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులను గెలుచుకుంది ఇంద్రజ.
Advertisement
Read also: ఆర్య సినిమాలోని గీత మరీ ఇంతలా మారిపోయిందా..?
అయితే జంతర్ మంతర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ.. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన “యమలీల” ముందుగా విడుదలై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మరెన్నో సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఇక ఈమె దూకుడు చూసి కచ్చితంగా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుందని అనుకున్న సమయంలోనే తల్లి అనారోగ్యం బారిన పడడం, వివాహం జరగడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. పిల్లలు కూడా జన్మించడంతో ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అలా దాదాపు పది సంవత్సరాలపాటు ఇండస్ట్రీకి దూరమైన ఇంద్రజ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను వెండితెరపై కాకుండా బుల్లితెరపై ప్రారంభించింది. అయితే తమిళ సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో ఆమె తోటి నటుడు అయిన మహమ్మద్ అబ్సర్ తో ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుంది.
Advertisement
అతడు కేరళకు చెందిన ఓ ముస్లిం. అయితే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇంద్రజ ఓ ముస్లింని పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద విషయమనే చెప్పాలి. అబ్సర్ కుటుంబీకులకి కూడా ఇంద్రజ అంటే చాలా ఇష్టమట. ఎంతలా అంటే.. ఇంద్రజ బ్రాహ్మిన్ కాబట్టి మాంసాహారం తినదు. ఇక వాళ్లకి ఇంద్రజ పై ఉన్న ప్రేమతో కుటుంబం మొత్తం మాంసాహారం మానేశారట. ఇంద్రజను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి నేటి వరకు వారి ఇంట్లో నాన్ వెజ్ వండలేదని అంటూ గర్వంగా చెప్పుకుంటుంది ఇంద్రజ. అయితే ఎప్పుడైనా అలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం నాన్ వెజ్ తినడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో కృష్ణ భగవాన్ తో కలిసి జడ్జిగా ప్రేక్షకులను అలరిస్తోంది ఇంద్రజ.