Advertisement
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరియు పద్మ భూషణ్ అవార్డు గ్రహీత సుధా మూర్తి భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన బిలియనీర్ జంటలలో ఒకరు. విజయం వైపు వారి ప్రయాణం సవాళ్లతో నిండిపోయింది, కానీ అది వారి సంకల్పాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుధా మూర్తి, నిరుద్యోగి నారాయణ మూర్తిని వివాహం చేసుకున్నారు. ఆమె కుటుంబం మొదట తిరస్కరించినప్పటికీ, సుధామూర్తి గారు నారాయణ మూర్తిగారిని విశ్వసించి ఆయనతో నిలబడ్డారు. చాలా మందికి వారి విజయగాథ గురించి తెలిసినప్పటికీ, ఈ పవర్ కపుల్ ల ప్రేమకథ ఎలా మొదలైందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ ఆర్టికల్ లో వారి లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
Advertisement
సుధామూర్తి నారాయణ మూర్తి గారిని కలిసే సమయానికి ఆమె విప్రో పూణే బ్రాంచ్ లో టెల్కో గా పని చేస్తున్నారట. డబ్బు విషయంలో ప్రణాలిక బద్దంగా, గుంభనంగా ఉండే నారాయణమూర్తికి అనుకోకుండా సుధతో పరిచయం చాలా విచిత్రంగా జరిగిందట. వారిద్దరికీ బేధాభిప్రాయాలు ఉన్నాయి. కానీ, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే వారి ప్రేమని శాశ్వతంగా నిలిపి ఉంచింది. ఓసారి కామన్ ఫ్రెండ్ ప్రసన్న సుధ తో పాటు తన స్నేహితులను, నారాయణమూర్తిని కూడా డిన్నర్ కి పిలిచారట. ఆ టైం లో ఒక్కత్తే ఆడపిల్ల కావడంతో వెళ్ళడానికి సుధ సంకోచించారట.
Advertisement
కానీ ఆమె కూడా రావడానికి నారాయణ మూర్తి ఒప్పించారట. ప్రసన్న వద్ద నుంచి తీసుకునే అన్ని పుస్తకాలలోనూ నారాయణ మూర్తి పేరు ఉండడంతో అప్పటికే సుధకు ఆయనపై ఓ అభిప్రాయం ఉండేది. ఆయనలో ఉండే వినయం, ముక్కుసూటి తత్వాన్ని చూసి సుధగారు పడిపోయారు. ఓ సారి నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. నువ్వు కోరుకునే సంపదలేవీ నేను ఇవ్వలేను. కానీ మీరు తెలివైన వారు, అందమైన వారు. నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ ప్రపోజ్ చేశారట. అప్పటికి రీసెర్చ్ అసిస్టెంట్ గానే ఉన్న నారాయణ మూర్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి సుధగారి ఫాదర్ ఒప్పుకోలేదట. దానికి తోడు నేను కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఎదగాలని అనుకుంటున్నానని, అనాధాశ్రమం పెట్టాలనుకుంటున్నానని నారాయణ మూర్తి చెప్పడంతో ఆ పెళ్లి ఆలోచనని సుధగారి తండ్రి విరమించుకున్నారు. చివరకు నారాయణ గారు ప్యాట్నీ కంప్యూటర్స్ లో జనరల్ మేనేజర్ గా జాయిన్ అయితే తప్ప ఆయనకు సుధని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. అలాగే వారిద్దరి పెళ్లి ఖర్చుని కూడా ఇద్దరూ చేరి సగం పంచుకున్నారట. ఇద్దరు చెరొక నాలుగొందల ఖర్చు పెట్టుకుని పెళ్లి చేసుకున్నారు.
Read More:
జై హనుమాన్.. ఈ కళ్ళని గమనించారా? ఎవరని అనిపిస్తోంది?
ఆ అవమానమే చిరంజీవిని మెగాస్టార్ గా మార్చింది.. పద్మ విభూషణ్ చిరంజీవి రియల్ లైఫ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే!
సాయి పల్లవి, రామ్ లక్ష్మణ్ కాకుండా.. టాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తున్న టాలీవుడ్ ట్విన్స్ వీరే!