Advertisement
ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడడం, నెట్ లేకపోతే పని జరిగే పరిస్థితి లేకపోవడంతో మొబైల్ లో ఇంటర్నెట్ తప్పనిసరిగా మారింది. ఇక బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే, వైఫై నే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా చాలామంది వాడటం వల్ల కొన్ని సార్లు వైఫై సిగ్నల్ సరిగ్గా అందటం లేదు. అయితే వైఫై సిగ్నల్ ను పెంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
* సాధారణంగా చాలామంది 802.11n లేదా 802.11గా స్పెసిఫికేషన్ ఉన్న వైఫై రూటర్ ను వాడుతుంటారు. అయితే అవి కాకుండా 802.11ac స్పెసిఫికేషన్ రూటర్ ను వాడితే వైఫై సిగ్నల్ పెరుగుతుంది. దీంతో వైఫై రేంజ్ ఎక్కువగా వస్తుంది.
* ఇంట్లో కొందరు వైఫై రూటర్లను కిటికీల వద్ద పెడుతుంటారు. అలా చేయకూడదు. ఇంటికి సరిగ్గా మధ్య భాగంలో రూటర్ ను పెట్టాలి. దీంతో వైఫై అన్ని వైపులా వస్తుంది.
Advertisement
* కొందరు వైఫై రూటర్లను బాగా ఎత్తులో పెడతారు. అలా కాకుండా మద్యస్థంగా ఉండేలా వాటిని పెట్టాలి. దీంతో వైఫై సిగ్నల్ మెరుగవుతుంది.
* ఇండ్లలో మైక్రోవేవ్ ఒవేన్లు ఉండేవారు వాటిని ఆఫ్ చేయాలి. వాటి వల్ల వైఫై సిగ్నల్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక ఓవెన్లను ఆఫ్ చేస్తే వైఫై సిగ్నల్ కొంతవరకు పెరుగుతుంది.
* స్పీకర్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వద్ద కూడా రూటర్లను పెట్టరాదు. వాటితో వైఫై సిగ్నల్ తగ్గుతుంది. వాటికి దూరంగా రూటర్లను ఉంచితే వైఫై సిగ్నల్ పెరుగుతుంది.
* మార్కెట్ లో మనకు వైఫై సిగ్నల్ ను పెంచే బూస్టర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని పెట్టుకోవడం ద్వారా కూడా వైఫై సిగ్నల్ పెంచుకోవచ్చు.
READ ALSO : క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ స్టేడియం !