Advertisement
ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి, సొంతంగా తన టాలెంట్ తో ఇంత పేరు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కారణంగా మెగా ఫ్యామిలీకి కూడా డిమాండ్, ఆదిపత్యం, క్రేజ్ బాగా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు కూడా వచ్చారు. మెగా ఫ్యామిలీకి కులాల పిచ్చి ఉండదని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో వేరే కులం వాళ్లనే పెళ్లి చేసుకోవడం మనం చూసాం.
Advertisement
పవన్ కళ్యాణ్ మొదలు నిహారిక వరకు చాలామందివి కులాంతర వివాహాలే. పవన్ కళ్యాణ్ మొదట నందిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర కి చెందిన బ్రాహ్మణ అమ్మాయి రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తర్వాత రష్యా కి చెందిన అన్నలేజీనోవతో ప్రేమలో పడి పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు. తర్వాత చిరంజీవి కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్ అనే ఒక బ్రాహ్మణ అబ్బాయిని ఇష్టపడింది. ఆ తర్వాత శ్రీజ అతనితో విడిపోయింది.
Advertisement
2016లో కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకుంది. ఇది కూడా కులాంతర వివాహమే. ఇటు అల్లు అర్జున్, స్నేహ రెడ్డిది కూడా కులాంతర వివాహమే. అలానే రామ్ చరణ్, ఉపాసనది కూడా కులాంతర వివాహం. నాగబాబు కూతురు నిహారిక సీనియర్ ఐపీఎస్ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కొడుకు వెంకట చైతన్య జొన్నలగడ్డని ప్రేమించింది.
తర్వాత రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి జరిగింది. కానీ పెళ్లై మూడేళ్లు కూడా గడవలేదు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ ఉత్తరప్రదేశ్ కి చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నాడు.
Also read: