Advertisement
Maa Oori Polimera 2 Actress: తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిల ఎంట్రీ గతంతో పోలిస్తే పెరిగిందనే చెప్పవచ్చు. తాజాగా తెలుగు తెరకు పరిచయం అయిన కొత్త అందం, టాలెంట్ పేరు “కామాక్షి భాస్కర్ల”. అందంతో పాటు అభినయం కూడా ఆమె సొంతం. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రియురాలు సినిమాతో ఆమె తెలుగునాట ఎంట్రీ ఇచ్చారు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా ఆమె ఓ రోల్ చేశారు.
Advertisement
Maa Oori Polimera 2 Actress Name, Images, Photos
ఆ తరువాత మా ఊరి పొలిమేర సినిమా కమెడియన్ సత్యం రాజేష్ కు వైఫ్ గా నటించారు. ఈ సినిమాలో డీగ్లామర్ రోల్ కావడంతో ఆమెలో నటన ప్రతిభను చూపించడానికి ఆమెకి ఓ మంచి అవకాశం దొరికినట్లయింది. రౌడీ బాయ్స్ అనే సినిమాలో కూడా కామాక్షి భాస్కర్ల నటించారు. సినిమాల్లోకి రాకముందు కామాక్షి ఓ డాక్టర్. ఆ తరువాతే యాక్టర్ అయ్యారు. చైనాలో మెడిసిన్ చదివిన కామాక్షి అపోలోలో కొంతకాలం పాటు పని చేసారు. సినిమాల్లోకి రాకముందు ఆమె ఓ మోడల్ కూడా.
Advertisement
2018 లో కామాక్షి మిస్ తెలంగాణగా ఎంపికయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన కామాక్షి భాస్కర్ల చిన్నతనంలోనే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా చూస్తే మా ఊరి పొలిమేర సినిమాలో ఆమెకు నటనకు అవకాసమ్ ఉన్న సినిమానే దొరికిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆమె నటించిన మూడు సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక రాబోయే సినిమా రౌడీ బాయ్స్ తో ఆమె ఎంతమేరకు ఆకట్టుకుంటారో వేచి చూడాలి.
మరిన్ని..
చిరంజీవి గురించి ఆ సినిమాలో అప్పుడు లావణ్య చెప్పిన మాటే నిజమయ్యిందిగా.. అదేంటంటే?
Maa oori Polimera 2 Review: మా ఊరి పొలిమేర 2 సినిమా తెలుగు రివ్యూ
Aarya Season 3 Review: ఆర్య సీజన్ 3 రివ్యూ.. ఒక్క బిట్ కూడా స్కిప్ చెయ్యకండి.. ఏ ఓటిటిలో చూడొచ్చంటే?