Advertisement
Hi Nanna Child Artist Name: ఈరోజు నాని నటించిన “హాయ్ నాన్న” సినిమా విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటించారు. పాజిటివ్ రివ్యూలతో దూసుకెళ్ళిపోతున్న ఈ సినిమాలో నాని కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సినిమా అందరిని ఆకట్టుకోవడంతో.. నాని కూతురుగా నటించిన అమ్మాయి ఎవరా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నాని సూపర్ ఫామిలీ మాన్ గా వచ్చిన సినిమా ఇది.
Advertisement
Hi Nanna Child Artist Name
నాని అభిమానులనే కాదు.. సినిమా లవర్స్ అందరిని ఈ సినిమా బాగా ఆకట్టుకుంటోంది. నాని ముప్పయ్యవ సినిమా రూపొందిన ఈ సినిమాలో నాని కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అందరి ప్రశంసల్ని అందుకుంటోంది. ఈ పాప పేరు కియారా ఖన్నా. చాలా మంది తెలుగు ప్రేక్షకులకు కియారా ఖన్నా తెలియకపోవచ్చు. కానీ ఆమెకి ఇదే మొదటి సినిమా అనుకుంటే మాత్రం పొరపాటే. కియారా ఖన్నా ఇంతకుముందు కూడా సినిమాల్లో నటించారు. ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
Advertisement
Hi Nanna Child Artist Name
బందా సింగ్, బారాముల్లా, థాంక్ గాడ్, సాంబహదూర్ వంటి సినిమాల్లో కియారా ఖన్నా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇవన్నీ సూపర్ హిట్ సినిమాలే. అలియా, సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగన్ వంటి టాప్ స్టార్స్ తో కూడా కియారా ఖన్నా స్క్రీన్ పంచుకుంది. ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని నిర్వహించుకుంటోంది. ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాకు మూడు లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. హాయ్ నాన్న సినిమాలో కియారా ఖన్నా రోల్ బాగా హైలైట్ అవుతుండడంతో ఆమె అందరికి నచ్చేసింది. తెలుగు ప్రేక్షకులకు మరో ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ దొరికేసిందన్నమాట.
Read More
చెన్నైలో వరద సహాయక చర్యల కోసం ఈ హీరో బ్రదర్స్ ఏమి చేసారో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
మహానటి సావిత్రి ఈ పెంపుడు జంతువుని పెంచుకున్నారా? ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు!
మీ చెప్పుల్ని ఎవరైనా కొట్టేసారా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ ప్రభావం ఎలా పడుతుందో తెలుసా?