Advertisement
CM YS jagan Mohan Reddy Daughters Harsha and Varsha: సెలెబ్రిటీల పిల్లలు అన్నాకా వారికి సాధారణ జీవితాన్ని గడపడం అనేది కష్టమైన పని. వారి ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయాలను దాచి పెట్టి నార్మల్ వ్యక్తులుగా, లో ప్రొఫైల్ తో చలామణి అవ్వడం అంటే అదేమీ ఆషామాషీ కాదు. మిస్ హర్ష రెడ్డి, మిస్ వర్ష రెడ్డి.. ఈ పేర్లు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. వీరిద్దరూ జగన్ మోహన్ రెడ్డి కూతుర్లు. తమ తాత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అని కానీ, తమ తండ్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అని కానీ పొగిడించుకోవడానికి వీరిద్దరూ ఇష్టపడరు. ఓ సెలెబ్రిటీ కిడ్ గా కంటే.. మాములుగా ఉండాలనే మెచూరిటీ ఇద్దరికీ ఉంది.
Advertisement
CM YS jagan Mohan Reddy Daughters names
వాస్తవాలు మాట్లాడాలంటే.. వారు సెలెబ్రిటీ లైఫ్ నుంచి దాక్కోలేదు. కేవలం అజ్ఞాతంలో ఉన్నారు అంతే. చిన్న వయసులోనే వారు తమ తాతకి ఉన్న ఫాలోయింగ్ ను, అత్యున్నత స్థితిని చూసారు. తమ తండ్రి జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఉన్న అప్ అండ్ డౌన్స్ ని కూడా చూసారు. వారి జీవితంపై వారికి పూర్తి అవగాహనా ఉంది. ప్రస్తుతం హర్షా ఫ్రాన్స్‌లోని ఫోంటైన్‌బ్లూలోని ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
Advertisement
జగన్ మోహన్ రెడ్డి చిన్న కుమార్తె వర్ష రెడ్డి యూనివర్శిటీ నోట్రే డామ్, ఇండియానా, USA లో చదువుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబం మరియు పిల్లల వివరాల గురించి చాలా వరకు గోప్యంగా ఉంచారు. ఆయన పెద్ద కుమార్తె UKలోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి డిగ్రీని పొందారు మరియు తర్వాత ఫ్రాన్స్‌లోని INSEAD బిజినెస్ స్కూల్‌లో చేరారు.
చదువులో నిష్ణాతులైన ఈ ఇద్దరు అమ్మాయిలు డాక్టర్ రాజశేఖరరెడ్డితో సాన్నిహిత్యంగా ఉండేవారట. ఆయన వీరికి అనేక పుస్తకాలను బహుమతులుగా ఇస్తూండేవారట. తన రాజకీయ జీవితంలో ఎదురవుతున్న పలు సవాళ్లు పిల్లలపై పడకుండా జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పరంగా యాత్రలతో బిజీ ఉన్న సమయంలో వీరు కుటుంబానికి దూరంగా లండన్ లో ఉన్నారు. కేవలం ఫోన్ తో మాత్రం కమ్యూనికేషన్ లో ఉన్నారు.
Read More:
బోయపాటిని ట్రోల్ చేసేముందు ఆలోచించండయ్యా.. ఆయన చేసిన ఈ మంచి పని గురించి తెలుసుకోండి !
క్రికెట్ ఫీల్డ్ లో ” టైమ్డ్ ఔట్” అంటే అర్ధం ఇదేనా? భారత్ లో ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా?