Advertisement
విజయ్ మాల్యా పేరు వింటే ఒక్కప్పుడు హై ప్రొఫైల్ లైఫ్ స్టయిల్, లగ్జరీ లైఫ్ స్టయిల్ అన్న పేర్లు వినిపించేవి. కానీ ఇటీవల ఆయన ఆర్థిక బాధ్యతారాహిత్యానికి చిహ్నంగా నిలిచాడు. లెక్కకు మించి అప్పులు తీసుకుని ఎగ్గొట్టడంతో.. బాధ్యతారాహిత్యుడు అని ముద్ర వేయించుకోవాల్సి వచ్చింది. యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ఆయనకు వారసత్వంగా వచ్చింది. మద్యం పానీయాలను ఉత్పత్తి చేయడం, అమ్మకాలపై ఈ గ్రూప్ పని చేస్తుంది. ఆయన ఈ వ్యాపారాన్ని బాగానే విస్తరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సహా అనేక పరిశ్రమలకు ఆయన తన వ్యాపారాన్ని విస్తరించారు.
Advertisement
అయితే, ఈరోజు విజయ్ మాల్యా గురించి ఎవరైనా అడిగితే, అతను దేశ డబ్బును దోచుకున్న దొంగ అని చాలా మంది చెబుతారు. ఆయన ఆర్ధిక సమస్యలు, రుణ ఎగవేతల గురించి దేశం మొత్తానికి తెలుసు. కానీ, ఆయన పర్సనల్ లైఫ్ స్టయిల్, వైవాహిక జీవితం గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ ఆర్టికల్ లో ఆయన వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం.
1. సమీరా తయాబ్జీ – విజయ్ మాల్యా మొదటి భార్య
1986 USAకి వ్యాపార పర్యటన సందర్భంగా, విజయ్ మాల్యా ఎయిర్ ఇండియా విమానంలో తన మొదటి ప్రేమ అనుభవాన్ని విజయ్ మాల్యా ఎదుర్కొన్నారు. ఎయిర్ హోస్టెస్ సమీరా తయాబ్జీతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు మరియు వారి ప్రేమ చిగురించి అదే ఏడాది వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొంతకాలానికే వారికి సిద్ధార్థ అనే కుమారుడు పుట్టాడు. సంవత్సర కాలంలోనే విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.
Advertisement
2. రేఖ – విజయ్ మాల్యా రెండవ భార్య
సమీరా తయాబ్జీతో విడాకులు తీసుకున్న తర్వాత విజయ్ మాల్యా జీవితం ఊహించని మలుపు తిరిగింది. 1993లో రేఖ అనే అమ్మాయిని విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే రేఖకు రెండు సార్లు వివాహం అయ్యింది. ఆమె మొదట కాఫీ రైతు ప్రతాప్ చెట్టియప్పను వివాహం చేసుకుంది. వారి విడిపోయిన తరువాత, ఆమె షాహిద్ మహమూద్‌ను వివాహం చేసుకుంది, ఆమెకు కబీర్ మరియు లైలా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాహిద్ మహమూద్ నుండి ఆమె విడాకులు తీసుకున్న తరువాత, విజయ్ మాల్యా మరియు రేఖ వివాహం చేసుకున్నారు.
3. పింకీ లాల్వానీ – విజయ్ మాల్యా మూడవ భార్య
విజయ్ మాల్యా తన రెండవ భార్య రేఖ నుండి విడాకుల వివరాలు ఇంకా చాలా వరకు తెలియనప్పటికీ, మిలియనీర్ మూడవసారి వివాహం చేసుకుంటాడని చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఉద్యోగి, పింకీ లాల్వానీతో విజయ్ మాల్యాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గతంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. వారు కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్నారని రూమర్స్ వస్తున్నాయ్. ఈ రూమర్స్ నిజమైతే పింకీ విజయ్ మాల్యాకు మూడవ భార్య అవుతారు.
Read More:
ఆ ఫేమస్ నటి మురళి శర్మ భార్య అని తెలుసా? ఒక్క డైలాగ్ తోనే ఫేమస్ అయిన ఈ నటి ఎవరంటే?
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే ఊహించని ట్విస్ట్ లు.. ఏమి జరిగిందంటే?
ఆరు పదుల వయసులో ఒక్కటయ్యారు… అందరు ఇలానే ఆలోచిస్తే బాగుంటుందేమో..!