Advertisement
పూరి జగన్నాథ్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు పూరి జగన్నాథ్. మొదట ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీల వద్ద శిష్యరికం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం గురువులను మించిన శిష్యుడు అనిపించుకున్నాడు పూరీ జగన్నాథ్. పూరి జగన్నాథ్ దర్శకునిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సినిమా బద్రి అన్న విషయం తెలిసిందే.
Advertisement
Read also: అనుష్క పక్కన అదరగొట్టిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లు గా ఈ చిత్రం తెరకెక్కింది. 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన విజయలక్ష్మి ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ రిలీజ్ అయింది. రమణ గోగుల సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమా కంటే ముందు పూరి జగన్నాథ్ అనుకున్న ప్రాజెక్టులు కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. అయితే అప్పటికే వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ ని కలిసి కథ చెప్పేశారు పూరి జగన్నాథ్.
Advertisement
ఈ సినిమా పూర్తయి విడుదలైన రోజున మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ నమోదయింది. దీంతో తన మొదటి సినిమాకే ఇలాంటి టాక్ రావడం ఏమిటి అని పూరి జగన్నాథ్ బాగా డిసప్పాయింట్ అయ్యారట. ఈ విషయాన్ని పూరీకి అత్యంత సన్నిహితుడైన నటుడు, సింగర్ రఘు కుంచె చెప్పుకొచ్చారు. “బద్రి సినిమా విడుదలై మొదటి షోకే నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ సమయంలో బద్రి సినిమాకి సంబంధించిన ఆఫీస్ కి సాయంత్రం వెళ్లాను. అప్పుడు పూరి జగన్నాథ్ బాధపడుతూ కింద కూర్చున్నారు. కానీ రెండవ రోజు నుండి ఈ చిత్రం టాక్ పాజిటివ్ గా మారింది. ఇక మూడవ రోజు నుండి పాజిటివ్ టాక్ తో ఏకంగా 200 రోజులు ఆడింది ” అని చెప్పుకొచ్చారు రఘు కుంచె.
Read also: వైరల్ గా బాలకృష్ణ పెళ్లి శుభలేఖ