Advertisement
Rajinikanth Wife Latha Love Story: సూపర్ స్టార్ రజినీకాంత్.. పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ బస్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రజనీకాంత్ నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీనే శాసించే స్థాయికి ఎదిగారు. తమిళ పరిశ్రమకు చెందినప్పటికీ రజినీకాంత్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. రజిని జీవితంలో అంతలా సక్సెస్ కావడానికి ఆయన భార్య కూడా ఒక కారణమని అనేక సందర్భాలలో చెప్పారు. రజినీకాంత్ భార్య పేరు లత. కాగా ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రజినీకాంత్.
Advertisement
Read also: BALAGAM MOVIE REVIEW: బలగం మూవీ రివ్యూ & రేటింగ్
1981 లో తిరుపతిలో రజనీకాంత్ వివాహం జరిగింది. 1982లో పెద్ద అమ్మాయి ఐశ్వర్య రజినీకాంత్, 1984లో రెండవ అమ్మాయి సౌందర్య రజనీకాంత్ జన్మించారు. రజనీకాంత్ కి భక్తీ ఎక్కువ. అలాగే రజినీకాంత్ సహనటుడు వై.జి మహేంద్రన్ ఆయనకు ప్రాణ మిత్రుడు కూడా. రజనీకాంత్ తరచూ మహేంద్ర ఇంటికి వెళ్లి కలుస్తుండేవారు. అప్పుడే ఆయన సోదరి లతా, రజినీని ఇష్టపడ్డారు. రజిని వ్యక్తిత్వం, ముక్కుసూటి తత్వం ఆమెకు బాగా నచ్చడంతో ఇరువురు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పట్లో రజినీకాంత్ ముక్కుసూటిగా ఉండేవారట. అన్యాయాన్ని అసలు భరించేవారు కాదట.
Advertisement
అందుకేనేమో ఆయనను యాంగ్రీ యంగ్ మాన్ అనేవారు. అయితే పెళ్లి అయిన తర్వాత లతా, భర్తలోని యాంగ్రీ నెస్ మొత్తాన్ని తగ్గించేసి పూర్తిగా మార్చేసినట్లు తమిళ ఇండస్ట్రీ వారు చెప్తుంటారు. ఇక పెళ్లి తర్వాతే రజిని పూర్తిగా రాఘవేంద్ర స్వామి భక్తుడిగా మారిపోయారు. రజనీకాంత్ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసింది కూడా ఆయన భార్య వల్లే అని సన్నిహితులు చెబుతుంటారు. ఏది ఏమైనా రజనీకాంత్ ప్రేమ పెళ్లి తనపై చాలా ప్రభావం చూపించి తనని మంచి మనిషిగా మార్చాయని చెప్పాలి. ఇక రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ మూవీ చేస్తున్నారు. దాంతోపాటు కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలామ్ లో ఓ పాత్రలో కనిపించనున్నారు.
Read also: దేవుడి ఉంగరాలు చేతికి దరిస్తున్నారా అయితే ఒక్కసారి ఇవి తెలుసుకోండి !