Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించాడు. ఇదిలా ఉంటే మనకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వారి పిల్లల గురించి చాలామందికి తెలిసిందే. వీరి వారసులు అందరూ సినీ ఇండస్ట్రీలో హీరోలుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కానీ విక్టరీ వెంకటేష్ భార్య, పిల్లల గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
Advertisement
Advertisement
ఎందుకంటే ఆయన ఎప్పుడూ తన భార్య పిల్లలను పెద్దగా బయట ఫంక్షన్ కి తీసుకురారు. అయితే ఇప్పుడు అసలు వెంకటేష్ భార్య పిల్లలు ఎలా ఉంటారు, వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వంటి విషయాలు తెలుసుకుందాం. వెంకటేష్ భార్య పేరు నీరజ. ఈమె మరెవరో కాదు ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు స్వయంగా మేనకోడలు. వెంకటేష్ – నీరజ వివాహం 1985లో జరిగింది. వారికి నలుగురు సంతానం ఉన్నారు. వెంకటేష్ పెద్ద కూతురు పేరు ఆశ్రిత కాగా.. రెండవ కూతురు హయవాహిని, చిన్న కూతురు పేరు భావన.
ఇక వెంకటేష్ కుమారుడి పేరు అర్జున్ రామనాథ్. పెద్ద కూతురు ఆశ్రిత విషయానికి వస్తే.. ఈమెకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. ఈమెకి బిజినెస్ పై ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం ఈమె తన భర్తతో కలిసి రెస్టారెంట్లను నిర్వహిస్తుంది. ఇక రెండో కూతురు హయవాహిని ఫ్యాషన్ డిజైనర్ కావాలని కోరుకుని ఆ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక మూడవ కూతురు భావన చదువు పూర్తి చేసుకుని క్రీడారంగం వైపు అడుగులు వేస్తోంది. ఇక దగ్గుపాటి వారసుడు అర్జున్ చదువుపై దృష్టి పెట్టి ముందుకి సాగుతున్నాడు. అర్జున్ తప్పకుండా సినిమాలలో నటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల అభిప్రాయం.
Read also: ఈ రెండు సినిమాలకు కామన్ లింక్.. వెంకీ ఖాతాలో రెండు హిట్స్ !